లెనోవో 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలు నేటినుంచే | Lenovo Vibe K5 to Be Made Available via Open Sale From Today | Sakshi
Sakshi News home page

లెనోవో 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలు నేటినుంచే

Published Mon, Jul 4 2016 11:22 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

లెనోవో 'వైబ్ కె 5'  ఓపెన్ అమ్మకాలు నేటినుంచే

లెనోవో 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలు నేటినుంచే


చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'వైబ్ కె 5'  ఓపెన్ అమ్మకాలను  సోమవారం నుంచి ప్రారంభించింది. ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన   ఈ స్మార్ట ఫోన్ ను తొలిసారి  ఓపెన్ అమ్మకాల ద్వారా అందుబాటులోకి వచ్చింది.  భారతదేశంలో   ఆసక్తి  వున్న వినియోగదారులు, ముందుగా  రిజిస్టర్ చేసుకోవాల్సి అవసరం లేకుండానే   అమెజాన్ లో  కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.    రూ.6,999 ధ‌ర‌కు ఈ స్మార్ట్‌ఫోన్ ల‌భ్యం కానుంది. ఎల్టీఈ   క్యాట్ 4 మద్దతుతో   150యంబీసీఎస్  డౌప్ లోడ్  వేగం, 50యంబీపీఎస్  అప్ లోడ్ వేగంతో పనిచేస్తుంది. ఇప్పటికే లక్ష మొబైళ్ల అమ్మకాలు చేపట్టినట్టు కంపెనీ  ప్రకటించింది. ఇండియాలో తమకు   వైబ్ కె5 మంచి ఆదరణ లభిస్తోందని లెనోవా ఇండియా తెలిపింది.  

లెనోవో వైబ్ కె5 ఫీచ‌ర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.2 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 415 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ
13 మెగాపిక్సెల్,  రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
2750 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15 గంటల టాక్ టైమ్
150 గ్రాముల బరువు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement