లెనోవో వైబ్ లో కొత్త ఫోన్ | Lenovo launches Vibe K5 in India | Sakshi
Sakshi News home page

లెనోవో వైబ్ లో కొత్త ఫోన్

Published Tue, Jun 14 2016 1:00 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

లెనోవో వైబ్ లో కొత్త ఫోన్ - Sakshi

లెనోవో వైబ్ లో కొత్త ఫోన్

ధర రూ.6,999
న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ కంపెనీ లెనోవో తన వైబ్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ కంపెనీ సోమవారం  వైబ్ కే5 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ. 6,999గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఏ6000 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా దీనిని తెస్తున్నామని పేర్కొంది. ఈ ఫోన్‌లో 720 బై 1280 పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న 5 అంగుళాల హై-డెఫినేషన్ డిస్‌ప్లే, 64-బిట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 415 ఆక్టాకోర్ సీపీయూ, ట్విన్ డాల్బీ అట్మాస్-ఎనేబుల్డ్ స్పీకర్లు, 2జీబీ డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సెల్ కెమెరా(వెనక వైపు), 5 మెగా పిక్సెల్ ముందు వైపు కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. బంగారం, వెండి, తదితర రంగుల్లో లభ్యమవుతుందని తెలిపింది. ఈ ఫోన్‌లను అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా విక్రయిస్తామని, ఈ నెల 22 మధ్యాహ్నం 2 నుంచి తొలి ఫ్లాష్ సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement