'ఎంఐ నోట్ 5' ధర తగ్గిందోచ్! | Xiaomi Mi 5 Price in India Cut by Rs. 2,000, Now Available at Rs. 22,999 | Sakshi
Sakshi News home page

'ఎంఐ నోట్ 5' ధర తగ్గిందోచ్!

Published Tue, Aug 23 2016 11:43 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

'ఎంఐ నోట్ 5' ధర తగ్గిందోచ్!

'ఎంఐ నోట్ 5' ధర తగ్గిందోచ్!

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్  షియోమి తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్   ఫోన్ ధరను తగ్గించుకుంది.  ఊహించినట్టుగానే షియామి ఎంఐ నోట్ 5 పేరుతో భారత్ లో  లాంచ్ అయిన ఈ మొబైల్ ధరను  రెండువేల  రూపాయలు తగ్గించింది. ఈ మేరకు కంపెనీ  ఇండియా హెడ్ మను జైన్ మంగళవారం ట్విట్ చేశారు. ఫ్లిప్ కార్ట్, ఎంఐ. కాం ద్వారా అందుబాటులో వున్న దీని ధరను 22,999 లుగా  ప్రకటించింది. గత రెండు సంవత్సరాలలో  భారతదేశం లో తమ అమ్మకాలు 72 శాతం పెరిగాయని ప్రకటించిన తర్వాత ఈ తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. మార్చి లో లాంచ్  సందర్బంగా  దీని ధరను రూ. 24, 999 గా కంపెనీ నిర్ణయించిన సంగతి  తెలిసిందే.

820 క్వాల్కం  స్నాప్  డ్రాగన్  ప్రాసెసర్,
5.5 ఫుల్ హెచ్ డీ స్క్రీన్ (1080x1920 ఎంపీ)
32జీబీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
16 మెగాపిక్సెల్  కెమెరా తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement