Redmi Note 3
-
నేటినుంచి షియోమి ఎంఐ5 ఓపెన్ సేల్
షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ5ను బుధవారం నుంచి మార్కెట్లో ఓపెన్ సేల్కు అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలుదారులు ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. ఎంఐ.కామ్ ఆన్లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ అమ్మకాలు కొనసాగుతాయి. ఏప్రిల్ 23 నుంచి రెడ్ ఎంఐ నోట్ 3 ఓపెన్ అమ్మకాలు చేపడుతున్న కంపెనీ, రెడ్ ఎంఐతో పాటు షియోమి ఎంఐ5 ను కూడా బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఎంఐ5 ధర రూ.24,999 కాగా, రెడ్ ఎంఐ నోట్ 3 ధర రూ. 9,999 నుంచి 11,999 వరకు ఉంది. మొత్తం గ్లాస్, మెటల్ డిజైన్ తో తయారుచేసిన ఈ షియోమి ఎంఐ5 స్మార్ట్ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ ఉంటుంది. 3జీబీ ర్యామ్ తో 32జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. 5.15 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ తో సన్ లైట్ డిస్ ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ ను రూపొందించారు. డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 3000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 4 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా దీనిలో ప్రత్యేకతలు. -
షావోమి నుంచి ‘రెడ్మి నోట్ 3’
ధర శ్రేణి రూ.9,999-రూ.11,999 న్యూఢిల్లీ: చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తాజాగా ‘రెడ్మి నోట్ 3’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ.. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానున్నది. 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999గా, 3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.4 గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5.5 అంగుళాల తెర, 4జీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ‘రెడ్మి నోట్ 3’ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బుధవారం నుంచి ఎంఐ.కామ్ సహా అమెజాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎంఐ-5 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెల భారత్‌లో ప్రవేశపెడతామని ప్రకటించింది. అలాగే బ్లూటూత్ స్పీకర్‌ను కూడా ఈ నెల చివరిలో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీని ధర రూ.1,999గా ఉంది. -
రెడ్మి నోట్ 3 విడుదల
చవక ధరలకే స్మార్ట్ ఫోన్లు అందిస్తూ భారతీయ మార్కెట్లోకి చొచ్చుకొచ్చిన చైనా కంపెనీ షియోమి తాజాగా తన రెడ్మి నోట్ 3ని విడుదల చేసింది. తొలిసారిగా అత్యంత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్ ఉండటం దీని ప్రత్యేకత. మెటల్ బాడీతో పాటు ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ వచ్చేందుకు వీలుగా 4050 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. దీని ధర రూ. 9,999 అని రెడ్మి సంస్థ ప్రకటించింది. దానివల్ల ఈ నోట్3ని ఒకసారి చార్జి చేస్తే రోజంతా పూర్తిగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సదుపాయాలతో పాటు తొలిసారిగా షియోమి నుంచి ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వచ్చిన ఫోన్ కూడా ఇదే. ఈ ఫోన్ 164 గ్రాముల బరువు ఉన్నా, మందం మాత్రం 8.65 మిల్లీమీటర్లు మాత్రమే. 5వి/2ఎ క్వాల్కామ్ క్విక్చార్జి టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుందని, దానివల్ల గంటలోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుందని, పూర్తిస్థాయిలో చార్జింగ్ అవ్వాలంటే మాత్రం 3 గంటల సమయం పడుతుందని అంటున్నారు. దీనికి 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. అత్యాధునిక క్వాల్కామ్ అడ్రెనో 510 జీపీయూ కూడా ఉండటంతో గేమ్స్ కోసం మంచి గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్సు కూడా ఉంటుందట.