షావోమి నుంచి ‘రెడ్మి నోట్ 3’ | Image for the news result Xiaomi Redmi Note 3 First Impression: At Rs 9999, meet the new mid-budget king | Sakshi
Sakshi News home page

షావోమి నుంచి ‘రెడ్మి నోట్ 3’

Published Fri, Mar 4 2016 1:36 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

షావోమి నుంచి ‘రెడ్మి నోట్ 3’ - Sakshi

షావోమి నుంచి ‘రెడ్మి నోట్ 3’

ధర శ్రేణి రూ.9,999-రూ.11,999
న్యూఢిల్లీ: చైనా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తాజాగా ‘రెడ్‌మి నోట్ 3’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ.. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్లలో లభ్యంకానున్నది. 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999గా, 3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.4 గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5.5 అంగుళాల తెర, 4జీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ‘రెడ్‌మి నోట్ 3’ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బుధవారం నుంచి ఎంఐ.కామ్ సహా అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎంఐ-5 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెల భారత్‌లో ప్రవేశపెడతామని ప్రకటించింది. అలాగే బ్లూటూత్ స్పీకర్‌ను కూడా ఈ నెల చివరిలో మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీని ధర రూ.1,999గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement