ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ మార్కెట్లో ఎంఐ, రెడ్ మీ పేరుతో మొబైల్స్ తీసుకొస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బడ్జెట్ ప్రియుల కోసం రెడ్ మీ పేరుతో మొబైల్స్ తీసుకొస్తుంది. ఇక ప్రీమియం యూజర్ల కోసం ఎంఐ పేరుతో మొబైల్స్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు మార్కెట్లోకి వస్తాయి. అయితే, ఇక నుంచి ఎంఐ పేరుతో కాకుండా ‘షియోమీ’ పేరుతోనే వినియోగదారుల చేరువ కావడం కోసం సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. (చదవండి: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్)
ఇక నుంచి ‘ఎంఐ’ లోగో స్థానంలో కొత్త బ్రాండ్ ‘షియోమీ’పేరుతో డివైజస్ మార్కెట్లోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన ఎంఐ బ్రాండ్ మొబైల్స్ ఇక నుంచి ‘షియోమీ' లోగోతో వస్తాయని పేర్కొంది. షియోమీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన నేపథ్యంలో ఆ పేరుతోనే యూజర్లకు దగ్గరికి కావడం కోసం కొత్త బ్రాండింగ్ తో ముందుకు వస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఎంఐ బ్రాండింగ్ గల ప్రొడక్ట్ స్థానంలో 'షియోమీ' పేరుతో కొత్త లోగో వస్తుంది. రెడ్ మీ కింద తయారు చేసిన ఉత్పత్తులు అదే లోగోతో కొనసాగుతాయని చైనీస్ టెక్ కంపెనీ పేర్కొంది. ఎంఐ బ్రాండింగ్‌కు బదులు ‘'షియోమీ’ లోగోను తీసుకురావాలని గత సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నట్లు ఇండియా మార్కెటింగ్ హెడ్ జస్కరన్ సింగ్ కపానీ పేర్కొన్నారు. చివరగా, భారతదేశంలో విడుదలైన దాని ల్యాప్ టాప్, ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ఎంఐ లోగోకు బదులుగా షియోమీ లోగోతో వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment