
టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత్ ఏడు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన వారికి పలు కంపెనీలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానాను ప్రకటించాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్‌ను సాధించిన భారత క్రీడాకారులకు షావోమీ కూడా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. షావోమీ కంపెనీ నుంచి క్రీడాకారులకు ఎమ్‌ఐ 11 అల్ట్రా, ఎమ్‌ఐ 11ఎక్స్ స్మార్ట్‌ఫోన్లను బహుకరించనుందనీ షావోమీ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మను కూమార్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ వ్యక్తిగత విభాగంలో ఆరు పతకాలను సాధించిన వారికి ఎమ్‌ఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లను అందించనుంది. హాకీ జట్టు ఆటగాళ్లకు ఎమ్‌ఐ 11ఎక్స్ స్మార్ట్‌ఫోన్లను అందించనున్నట్లు షావోమీ ఎమ్‌డీ మను కుమార్ జైన్ ట్విటర్‌లో ప్రకటించారు. షావోమీ స్మార్ట్‌ఫోన్లలో ఎమ్‌ఐ 11 అల్ట్రా అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దీని ధర రూ. 69,999.
Comments
Please login to add a commentAdd a comment