ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి కొత్త రెడ్‌మీ నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌కు భారీ ఆదరణ వచ్చింది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో ఇప్పటికే రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగా, రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఈ రెండ స్మార్ట్‌ఫోన్స్ బడ్జెట్ ధరలో ఉండేలా రెడ్‌మీ రూపొందించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ రెడ్‌మీ నోట్ 11 మోటో జీ51, రియల్‌మీ 8 లాంటి మోడల్స్‌కు గట్టిపోటీ ఇవ్వనుంది.
ధర ఎంతంటే..!
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో రానున్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499 ఉండగా, 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది. హొరైజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్‌బర్స్ట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్ సేల్ ఫిబ్రవరి 11న సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, ఎంఐ స్టూడియో, రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయవచ్చును.
రెడ్‌మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్
- 6.43 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ+ 2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా(రెడ్ మీ 11 ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 108 ఎంపీ రియర్ కెమెరా)
- 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా
- 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
- 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 4జీ ఎల్‌టీఈ సపోర్ట్
- బ్లూటూత్ 5.0
- యూఎస్‌బీ టైప్ సీ సపోర్ట్
చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు పెను ప్రమాదం..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..!
Comments
Please login to add a commentAdd a comment