ఇదేదో పజిల్‌లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ కీబోర్డును మీదున్న అక్షరాలతో ఈ ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నాయి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు. అదెలా అంటే..
నేను..
‘‘వికసిత్ భారత్ కోసం ఎవరు ఓటు వేయనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కీబోర్డులోని యూ అండ్ ఓ మధ్య ఉన్న లెటర్‌ను బిగ్గరగా చదవండి’’ అని భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ రెండు లెటర్స్ మధ్యనున్న అక్షరం ‘ఐ’. ఆ మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరూ ‘ఐ’ అంటారు. సో... వారంతా తాము బీజేపీకి ఓటు వేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసినట్టేనని బీజేపీ భావిస్తోంది.
మేము..
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ ట్రెండ్‌నే అనుసరిస్తోంది. ‘‘నియంత నరేంద్ర మోదీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? కీబోర్డులో క్యూ, ఆర్ మధ్య ఉన్న లెటర్స్‌ను చదవండి’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇక్కడ క్యూ, ఆర్ మధ్య ఉన్నది డబ్ల్యూ, ఈ.. రెండక్షరాలను కలిపితే ‘మేము’ అనే అర్థం వస్తుంది. మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తామని సందేశాన్నిచ్చేలా ఆప్ వైరల్ చేస్తోంది.
పోలీసులు సైతం..
ఈ రెండు పార్టీలిలా ఉంటే.. సురక్షితమైన డ్రైవింగ్ గురించి అవగాహన కలి్పంచేందుకు ఢిల్లీ పోలీసులు కూడా ఈ వైరల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ‘‘డ్రైవింగ్ చేస్తూ మీరు కీ బోర్డును చూస్తే.. క్యూ అండ్ ఆర్ మధ్యలో లెటర్స్ (డబ్ల్యూ, ఈ) చలాన్‌తో మిమ్మల్ని కలుస్తాయి’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. అంటే మీరు కీబోర్డు చూస్తే వి (మేము) చలాన్ వేస్తామని అర్థమన్నమాట.
– సాక్షి, నేషనల్ డెస్క్
Lok sabha elections 2024: ‘రీడ్ ద లెటర్ బిట్వీన్’
Published Thu, Apr 25 2024 6:51 PM | Last Updated on Thu, Apr 25 2024 6:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment