webcam
-
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్‌క్యామ్‌లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్‌క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్‌క్యామ్‌లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్‌నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్‌లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్‌క్యామ్‌లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్‌కెమెరా ఫీచర్‌ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్‌ని పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్‌క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్‌క్యామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్‌లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
యాపిల్ లోపం... విద్యార్థి ఇంట కాసుల వర్షం!
కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న, చిన్న తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ సూత్రం మనకే కాదు దిగ్గజ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దిగ్గజ కంపెనీలకు చెందిన సాంకేతికతలో ఉన్న చిన్న లోపం వల్ల కూడా కొన్నిసార్లు వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి చిన్న తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే ఏమి పర్వాలేదు. టెక్ దిగ్గజ యాపిల్ కంపెనీ ఇప్పుడు అదే పని చేసింది. ర్యాన్ పిక్రెన్ అనే సైబర్ సెక్యూరిటీ విద్యార్థికి బిగ్ బౌంటీ కింద 100,500 డాలర్లు(సుమారు రూ.75 లక్షలు) ఇచ్చింది. మ్యాక్ వెబ్‌క్యామ్‌లను హ్యాకర్లు హ్యాక్ చేసే విధంగా ఉన్న ఒక లోపాన్ని గుర్తించినందుకు యాపిల్ ఆ డబ్బులను ఇచ్చింది. ఐక్లౌడ్ షేరింగ్, సఫారీ 15తో సహ ఇతర బ్రౌజర్లలో వరుసగా బయటపడుతున్న లోపాల వల్ల హ్యాకర్లు వెబ్‌క్యామ్‌లను హ్యాక్ చేయవచ్చు అని ర్యాన్ పిక్రెన్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపారు. గత ఏడాది యాపిల్ ఈ లోపాలను పరిష్కరించినట్లు వైర్డ్ మీడియా తెలిపింది. "ఈ లోపం వల్ల భాదితులు ఓపెన్ చేసిన పోర్టల్ వివరాలు అన్నీ హ్యాకర్ చేతికి వెళ్తాయి. కొన్నిసార్లు, మన వెబ్‌క్యామ్ కూడా రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. నేను కనిపెట్టిన బగ్ మీ ఐక్లౌడ్, పే పాల్, ఫేస్ బుక్, జీమెయిల్ మొదలైన ఖాతాలను కూడా హ్యాక్ చేయగలదు" అని ఆయన ఆ పోస్టులో రాశారు. సాధారణంగా కొన్నిసార్లు మనం డజన్ల కొద్దీ బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు అకస్మాత్తుగా అనేక యాదృచ్ఛిక ప్రకటనల రావడం మనం గమనిస్తుంటాం. అయితే, ఇది కూడా హ్యాకింగ్‌లో ఒక టెక్నిక్. గత సంవత్సరం చివరలో బయటపడిన మాక్ ఓఎస్ లోపం మీ సఫారీ ట్యాబ్, ఇతర బ్రౌజర్ సెట్టింగ్ వివరాలను దోపిడి చేసి ఉండవచ్చు అని పిక్రెన్ పేర్కొన్నారు. ఈ లోపం వల్ల హ్యాకర్లు మీ ఆన్లైన్ ఖాతాలపై నియంత్రణ పొందడమే కాకుండా, మీ మైక్రోఫోన్ ఆన్ చేయడం లేదా మీ వెబ్‌క్యామ్ హ్యాక్ చేసి ఉండవచ్చు అని అన్నారు. అందుకే, ముఖ్యమైన వివరాలను,పాస్‌వర్డ్‌లను ఎన్నడూ కూడా బ్రౌజర్లలో సేవ్ చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైన నగదు లావాదేవీలు చేసేటప్పుడు వర్చువల్ కీ బోర్డ్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. (చదవండి: తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్!) -
వెబ్‌క్యామ్ ముందు ఏడ్వండి!
పారిస్: నవ్వు నాలుగు విధాల చేటంటారు పెద్దలు. మరి ఏడ్వడం? ఏడిస్తే...ముఖ్యంగా వెక్కి వెక్కి ఏడిస్తే గుండెలో గూడుకట్టుకున్న విషాదం తొలగిపోతుందట. హృదయం తేలిక పడుతుందట. ఒంటరి తనం దూరమవుతుందట. తనువు తాపం తీరిపోతుందట. శరీరంలో కొత్త శక్తి పుట్టుకొచ్చి నూతనోత్సాహం కలుగుతుందట. ఇదీ పారిస్‌కు చెందిన ఓ యువ కళాకారిణి డోరా మౌటోట్ ఫిలాసఫీ. గత కొంతకాలంగా ఒంటరితనాన్ని భరించలేక కంప్యూటర్ వెబ్‌క్యామ్ ముందు పదే పదే ఏడ్చిన డోరా ఇప్పుడు తన కన్నీళ్లను ప్రపంచంతో పంచుకోవడానికి ‘వెబ్‌క్యామ్ టియర్స్’ పేరిట ఏకంగా ఓ ప్రాజెక్ట్‌నే చేపట్టింది. ‘నా కన్నీళ్లను షేర్ చేసుకోవడానికి మీరు కూడా వెబ్‌క్యామ్ ముందు ఒంటరిగా ఏడ్వండి. ఇదేమి నా పిచ్చి కాదు. ఈ సమాజంలో ఏడ్వడానికి ఎందుకు సిగ్గుపడతారు? ఏడ్వడం బలహీనతకు గుర్తనుకుంటున్నారా? అదేమి కాదు. ఈ ప్రపంచంతో మీ కన్నీళ్లను పంచుకోండి. ఆ వీడియో క్లిప్‌లను నాకు పంపించండి’ అని ఆమె ఫేస్బుక్, టంబ్లర్ పేజీల్లో పిలుపునిచ్చింది. అంతే సోషల్ వెబ్సైట్లో ఏడ్వడం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే ఆమెకు ఏడ్చే వీడియోలు దాదాపు వంద వచ్చాయట. అలా వచ్చిన వీడియోల క్లిప్పులన్నింటినీ ఓ చోట చేర్చి మళ్లీ సోషల్ మీడియాకు చూపిస్తుందట. ‘ 365 డేస్: ఏ కాటలాగ్ ఆఫ్ టియర్స్’ పేరిట ఏడాది పాటు తన విషాదాన్ని వెళ్లలగక్కిన లారెల్ నకాడేట్ అనే ఆర్టిస్ట్‌ను స్ఫూర్తిగా తీసుకొని తానీ ప్రాజెక్ట్‌ను చేపట్టానని, వెబ్సైట్లలో జననాంగాలను చూసి ఆశ్చర్యపడే రోజులు పోయాయని, ఇకముందు టియర్స్ కూడా కొత్తరకం పోర్నోగ్రఫీ అని వ్యాఖ్యానించారు.