
శాన్ ఫ్రాన్సిస్కో: ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్స్ కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌లో ‘గో’ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. మరింత స్టోరేజీతోపాటు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.
అదనంగా 500 ఎంబీ స్టోరేజీతో పాటు డేటా వినియోగాన్ని ఎప్పటికప్పుడు చూపించే డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్స్ ఇందులో పొందవచ్చని ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం డైరెక్టర్ సాగర్ కామ్‌దార్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఫోన్ వినియోగాన్ని సులభతరం చేసే ఆండ్రాయిడ్ 9 పై వెర్షన్‌ను గూగుల్ ఈ ఆగస్టులోనే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment