ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భారతీయుల జీవితంలోని వివిధ రంగాలలో మహిళలు పోషించే పాత్రను భారతీయ జీవన దృక్కోణం ద్వారా చూడాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పశ్చిమ దేశాల దృక్కోణం నుండి భారతీయ మహిళల ఔన్నత్యాన్ని ఎంతమాత్రం చూడరాదని ఆమె స్పష్టం చేశారు.
భారతీయ నాగరికత ఎల్లప్పుడూ మహిళలకు సముచితమైన గౌరవాన్ని ఇస్తుందని, పాశ్చాత్య దేశాలు అంచనాలకు భిన్నంగా వారిని ఎల్లప్పుడూ సమానంగా చూస్తుందని ఆమె ఇక్కడ జరిగిన పుస్తక విడుదల కార్యక్రమంలో అన్నారు.
‘‘శక్తి: మహిళలు, జెండర్ అండ్ సొసైటీ ఇన్ ఇండియా – పెర?్స్పక్టివ్స్ ఆన్ ఫెమినిజం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాభారతం వంటి ఇతిహాసాలను ఉటంకించారు. ఈ సందర్భంగా ప్రాచీన భారతదేశంలో మహిళలు పోషించిన పాత్రను వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే..
→ స్త్రీ పరాక్రమాన్ని ఉపయోగించుకోవడాన్ని మన ధర్మం అంగీకరించింది. మన ధర్మం స్త్రీ పాత్రను కాదనలేదు. ఇది స్త్రీ లేదా పురుషుడన్న విషయాన్ని చూడదు. ఆచరించే ధర్మాన్ని చూస్తుంది. చాలా సార్లు స్త్రీలు ఆ ధర్మాన్ని ఆచరించడానికి తెరపైకి వచ్చారు. ఈ విషయాన్ని పశి్చమ దేశాలు చూడలేదు. కాబట్టి, మనం ఈ రక్షణాత్మక మనస్తత్వం నుండి బయటపడాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను.
→ ఇక్కడ మహాభారతాన్ని ప్రస్తావించాలి. ద్రౌపదికి అన్యాయం జరిగినప్పటికీ, ఆమె తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ సొంత మార్గంలో తనను తాను నిరూపించుకుంది. తాను సాధించాలనుకున్నది సాధించింది.
→ భారత్ మహిళ ఔన్నత్యం చరిత్ర పుటల్లో రికార్డు అయ్యింది. ఏదీ ఫిల్టర్ కాలేదు. జరిగిన అన్యాయాన్ని రాయడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు. మన నాగరికత ఎప్పుడూ విషయాలు ఉన్నట్లుగా చెప్పడానికి దూరంగా ఉండదు.
→ మహిళలపై ఆధునిక సాహిత్యాన్ని పరిశీలిస్తే, పాశ్చాత్య స్త్రీవాద దృక్పథం తగిన విధంగా లేదు. మనల్ని మనం నిర్వచించుకోవడానికి వారి పదజాలాన్ని ఉపయోగిస్తాము. ఇది ఎంతమాత్రం సరికాదు.
→ భారత్ సాంస్కృతిక విలువలు, మహిళల పట్ల తమ విశిష్టమైన ప్రవర్తన పట్ల దేశ ప్రజలు గర్వపడాలి.
Comments
Please login to add a commentAdd a comment