యాక్టర్... నానాపటేకర్ డైరెక్టర్... ప్రకాశ్ రాజ్ | prakashraj direction in bollywood movie with nanapatekar | Sakshi
Sakshi News home page

యాక్టర్... నానాపటేకర్ డెరైక్టర్... ప్రకాశ్ రాజ్

Published Mon, Apr 4 2016 11:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

యాక్టర్... నానాపటేకర్  డైరెక్టర్... ప్రకాశ్ రాజ్ - Sakshi

యాక్టర్... నానాపటేకర్ డైరెక్టర్... ప్రకాశ్ రాజ్

ప్రసిద్ధ నటుడు ప్రకాశ్‌రాజ్ దర్శకునిగా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ ఉత్తమ నటుడు నానాపటేకర్ హీరోగా ‘తడ్కా’ పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ఇంతకు ముందు ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో ‘ఉలవచారు బిర్యానీ’ (తమిళంలో ‘ఉన్ సమయిల్ అరయిల్’) చిత్రాన్ని డెరైక్ట్ చేశారు. ఇప్పుడు జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ‘తడ్కా’ చిత్రీకరణ మే, జూన్‌ల్లో జరగనుంది. శ్రీయ, తాప్సీ నాయికలుగా నటించనున్నారు. ‘నానూ నన్న కనసు’(కన్నడ), ‘ధోని’ (తెలుగు, తమిళ) చిత్రాలు డెరైక్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్ ప్రస్తుతం తెలుగు, కన్నడాల్లో ‘మనవూరి రామాయణం’ అనే సినిమా డెరైక్ట్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement