tadka
-
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్‌లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్‌ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్‌లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్‌ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
అత్యుత్తమ వంటకాల జాబితాలో...షాహీ పనీర్, దాల్, కుర్మా!
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది వెరైటీలకు చోటు దక్కింది. టాప్–50 వంటకాల్లో షాహీ పనీర్ ఐదో స్థానంలో నిలిచింది. కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్‌కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్‌కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. అయితే, 38 స్థానం దక్కిన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వంటకం చికెన్ టిక్కాను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం విశేషం! ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) -
తడాఖా చూపించిన తాప్సీ!
తాప్సీ అందంగా ఉంటారు.. బాగా నటిస్తారు.. చక్కగా మాట్లాడతారు... ఇది అందరికీ తెలిసిన విషయమే. తల్చుకుంటే ఈ బ్యూటీ డైలాగ్స్ కూడా రాయగలరు. ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఓ సినిమాకి సంభాషణలు రాశారు. హిందీ చిత్రం ‘తడ్కా’లో ఆ డైలాగ్స్‌ని వినొచ్చు. ఇంతకీ ఇప్పుడు ఈవిడగారు రచయిత్రిగా మారడానికి కారణం ఏంటనే విషయంలోకి వస్తే... తెలుగు, కన్నడ భాషల్లో ప్రకాశ్‌రాజ్ నటించి, దర్శకత్వం వహించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం గుర్తుంది కదా! ఈ చిత్రాన్ని హిందీలో ‘తడ్కా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ప్రకాశ్‌రాజ్, శ్రీయ ఓ జంట కాగా, యువ జంటగా తాప్సీ, అలీ ఫాజల్ నటిస్తున్నారు. ‘మీ పాత్రలకు మీరే డైలాగ్స్ రాసుకోండి’ అని తాప్సీ, ఫాజల్కి ప్రకాశ్‌రాజ్ స్వేచ్ఛ ఇచ్చారట. ఆ విషయం గురించి తాప్సీ మాట్లాడుతూ - ‘‘ఏ ఆర్టిస్ట్ అయినా పాత్రను పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ పాత్ర ఏం మాట్లాడితే బాగుంటుందో వాళ్లకు తెలుస్తుందని ప్రకాశ్ సార్ అన్నారు. అప్పుడు ఆ ఆర్టిస్ట్ తాను చేసే పాత్ర మాట్లాడే డైలాగ్స్‌ని తానే రాసుకుంటే సహజత్వానికి దగ్గరగా ఉంటుందని కూడా ఆయన అన్నారు. అందుకే మా డైలాగ్స్ మేమే రాసుకున్నాం’’ అన్నారు. తాప్సీ, అలీ సొంతంగా డైలాగ్స్ రాయడంవల్ల ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లే ఉందనీ, సినిమాటిక్‌గా లేదనీ చిత్రబృందం అంటోంది. మొత్తం మీద ‘తడ్కా’ సెట్లో రైటర్స్‌గా తమ తడాఖా ఏంటో తాప్సీ, అలీ చూపించేశారన్నమాట. -
యాక్టర్... నానాపటేకర్ డైరెక్టర్... ప్రకాశ్ రాజ్
ప్రసిద్ధ నటుడు ప్రకాశ్‌రాజ్ దర్శకునిగా బాలీవుడ్లో కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ ఉత్తమ నటుడు నానాపటేకర్ హీరోగా ‘తడ్కా’ పేరుతో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ఇంతకు ముందు ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో ‘ఉలవచారు బిర్యానీ’ (తమిళంలో ‘ఉన్ సమయిల్ అరయిల్’) చిత్రాన్ని డెరైక్ట్ చేశారు. ఇప్పుడు జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ‘తడ్కా’ చిత్రీకరణ మే, జూన్‌ల్లో జరగనుంది. శ్రీయ, తాప్సీ నాయికలుగా నటించనున్నారు. ‘నానూ నన్న కనసు’(కన్నడ), ‘ధోని’ (తెలుగు, తమిళ) చిత్రాలు డెరైక్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్ ప్రస్తుతం తెలుగు, కన్నడాల్లో ‘మనవూరి రామాయణం’ అనే సినిమా డెరైక్ట్ చేస్తున్నారు.