స్క్రీన్‌ టెస్ట్‌ | screen test about tollywood movies special | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Apr 20 2018 1:17 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

screen test about tollywood movies special  - Sakshi

► ప్రభాస్‌ నటించిన ఓ సినిమాకు ‘వారధి’ అని పేరు పెట్టారు. తర్వాత వేరే కారణాలవల్ల సినిమాకు పేరు మార్చారు. ఏ సినిమాకు ఇలా జరిగిందో తెలుసా?
ఎ) మిర్చి   బి) మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌   సి) మున్నా   డి) డార్లింగ్‌

► తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్‌ తన తమ్ముడిని హీరోగా చేయటానికి ప్రయత్నిస్తోంది. ఆ హీరోయిన్‌ ఎవర బ్బా?
ఎ) తమన్నా బి) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌    సి) హన్సిక    డి) లావణ్యా త్రిపాఠి

► నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏ మాయ చేశావె’ చిత్రానికి సంగీతదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) యస్‌.యస్‌. తమన్‌    బి) హారీస్‌ జయరాజ్‌   సి) అనూప్‌ రూబెన్స్‌   డి) ఏ.ఆర్‌. రెహమా¯Œ

► దర్శకుడు రాజమౌళిని ఓ హీరో జక్కన్న అని పిలుస్తారు. ఎవరా హీరో?
ఎ) యన్టీఆర్‌   బి) ప్రభాస్‌   సి) రామ్‌చరణ్‌   డి) రవితేజ

► ‘బాషా’ దర్శకుడు సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో ‘అస్త్రం’  అనే సినిమాలో నటించారు హీరోయిన్‌ ‘అనుష్క’. ఆ సినిమా హీరో ఎవరో గుర్తుందా?
ఎ) సుమంత్‌   బి) రానా   సి) విష్ణు  డి) గోపీచంద్‌

► ‘కలలా నా జీవితంలోకి వచ్చావ్, కల కంటున్నపుడు వెళ్లిపోయావ్, మళ్లీ ఇన్నాళ్లకి మెరిశావు... కలో నిజమో అర్థం కావట్లేదు’ అనే డైలాగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ ఏ హీరోయి¯Œ తో చెప్పాడో తెలుసా?
ఎ) పూజా హెగ్డే       బి) రాశీ ఖన్నా   సి) హెబ్బా పటేల్‌   డి) ప్రగ్యా జైస్వాల్‌

► ‘జానకి జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి ’ అనే సూపర్‌హిట్‌ పాట రచయిత ఎవరు?
ఎ) వనమాలి   బి) అనంత శ్రీరామ్‌    సి) భాస్కరభట్ల   డి) చంద్రబోస్‌

► త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ హీరో ఫస్ట్‌ టైమ్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే సెట్స్‌కి వెళ్లిన ఆ సినిమా హీరో ఎవరో తెలుసా?
ఎ) ప్రభాస్‌   బి) ఎన్టీఆర్‌   సి) రామ్‌చరణ్‌   డి) చిరంజీవి

►   ‘హాంకాంగ్‌’లో పుట్టిన ఈ ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కుటుంబం లండన్‌లో సెటిల్‌ అయ్యింది. ఆమె తెలుగు సినిమాలో కూడా నటించిన హీరోయినే.ఎవరయ్యుంటారామె?
ఎ) అమీషా పటేల్‌   బి) అయేషా టకియా    సి) కంగనా రనౌత్‌      డి) కత్రినా కైఫ్‌

► ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో 71 లక్షలమంది ఫాలోయర్లను సొంతం చేసుకున్నహీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) కాజల్‌ అగర్వాల్‌      బి) శ్రుతీహాసన్‌    సి) ఇలియానా  డి) సమంత

► నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఏ దర్శకుని ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారో తెలుసుకుందామా?
ఎ) దాసరి బి) భారతీరాజా సి) బాలు మహేంద్ర  డి) బాలచందర్‌

► 1998లో ఈ హీరోయిన్‌  ‘మిస్‌ సూరత్‌’. ఆ తర్వాత తెలుగు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఎవరా హీరోయిన్‌?
ఎ) నమిత  బి) మీనా   సి) త్రిష     డి) సిమ్రాన్‌

► ‘నేను నా జీవితం’ అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ నటుడెవరో తెలుసా?
ఎ) కాంతారావు  బి) కృష్ణ     సి) అక్కినేని నాగేశ్వరరావు    డి) శోభన్‌బాబు

► ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ స్విమ్‌ మీట్‌ ఈత పోటీల్లో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించిన వేదాంత్‌ ఏ హీరో కుమారుడో తెలుసా?
ఎ) విజయ్‌    బి) మాధవన్‌    సి) విక్రమ్‌    డి) అజిత్‌

► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. అందులో జెమినీ గణేశన్‌ పాత్రలో నటించింది ఎవరు?
ఎ) విజయ్‌ దేవరకొండ  బి) మోహన్‌బాబుసి) నాని     డి) దుల్కర్‌ సల్మాన్‌

► మణిపాల్‌ యూనివర్శిటీలో జర్నలిజం చదువుకుని, తర్వాత హీరోయిన్‌గా సింగర్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ ఎవరో కనుక్కోండి చూద్దాం?
ఎ) నివేథా థామస్‌               బి) నిత్యామీనన్‌      సి) అనూ ఇమ్మాన్యుయేల్‌    డి) అనుపమా పరమేశ్వరన్‌

► ‘శంకర్‌దాదా’ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన యువ హీరో ఎవరో గుర్తుందా?
ఎ) శర్వానంద్‌         బి) సందీప్‌ కిషన్‌       సి) శ్రీనివాస్‌ అవసరాల  డి) ప్రిన్స్‌

► ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంలో శ్రీదేవి ముఖ్య తారగా నటించారు. శ్రీదేవి మేనకోడలి  పాత్రలో నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా? శేఖర్‌ కమ్ముల ‘లీడర్‌’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఆమె నటించారు?
ఎ) రిచా గంగోపాధ్యాయ    బి) దీక్షాసేథ్‌∙    సి) ప్రియా ఆనంద్‌   డి) కమలినీ ముఖర్జీ

► సుమన్, భానుప్రియ నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) సితార బి) అన్వేషణ సి) ఆలాపన డి) ప్రేమించు పెళ్లాడు

► ఈ ఫొటోలోని ప్రముఖ హాస్యనటి ఎవరో కనుక్కోండి?
ఎ) శ్రీలక్ష్మీ బి) రమాప్రభ   సి) గీతాంజలి   డి) తెలంగాణ శకుంతల

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) బి 3) డి 4) ఎ5) సి 6) బి 7) సి 8) బి 9) డి 10) ఎ 11) డి

12) ఎ 13) సి 14) బి 15) డి 16) బి17) ఎ 18)  సి 19) ఎ20) బి

నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement