► ఈ నలుగురు కథానాయికల్లో ఈ ఏడాది తెలుగులో ఎక్కువ సినిమాలుచేసిన భామ ఎవరు?
ఎ) కాజల్ అగర్వాల్ బి) తమన్నా భాటియా సి) త్రిష డి) సమంత
► 2017 సంక్రాంతికి రిలీజైన సినిమా ‘ఖైదీ నంబర్–150’. ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమా రిలీజు అయ్యిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి?
ఎ) ఐదు సంవత్సరాలు బి) ఏడు సంవత్సరాలు సి) ఆరు సంవత్సరాలు డి) తొమ్మిది సంవత్సరాలు
► ఈ సంవత్సరం మంచు విష్ణు, గోపీచంద్‌ల సరసన నటించిన బ్యూటీ ఎవరో కనిపెట్టండి?
ఎ) రాశిఖన్నా బి) హన్సిక సి) క్యాథరిన్ డి) ప్రగ్యాజైస్వాల్
► ‘ఆకతాయి’ సినిమాలోని ‘అనగా అనగా నిన్నే కలగన్నా’ అనే పాటను పాడింది గాయకుడు కాదు... రైటర్. ఆయనెవరు?
ఎ) చంద్రబోస్ బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి
► ఈ సంవత్సరం బాక్సాఫీస్ పరంగా చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించిన సినిమా?
ఎ) మెంటల్ మదిలో బి) మళ్లీరావా సి) ద్వారకా డి) అర్జున్ రెడ్డి
► 2017లో తన మొదటి సినిమాలోనే లిప్ లాక్‌లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన భామ ఎవరో కనుక్కోండి?
ఎ) కళ్యాణి ప్రియదర్శన్ బి) శాలిని పాండే సి) సాయిపల్లవి డి) మేఘాఆకాష్
► ఈ ఏడాది ఈ హీరో సినిమా రిలీజ్ అవ్వలేదు. ఎవరై ఉంటారో గమనించారా?
ఎ) రామ్‌చరణ్ బి) యన్టీఆర్ సి) మహేశ్‌బాబు డి) అల్లుఅర్జున్
► ‘‘తిక్కుంటే లెక్కుండాలి, ఈ పిల్లకు ఓన్లీ తిక్క నో లెక్క’’అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) సాయిధరమ్ తేజ్ బి) వరుణ్‌తేజ్ సి) అల్లుశిరీష్ డి) నాగశౌర్య
► ఈ సంవత్సరంతో హ్యాట్రిక్ సాధించిన దర్శకుడెవరు?
ఎ) విరించివర్మ బి) అనిల్ రావిపూడి సి) సతీష్ వేగేశ్న డి) బీవియస్.రవి
► 2017లో రిలీజైన సినిమాకు 2016వ సంవత్సరానికి నేషనల్ అవార్డు లభించింది. ఈ సినిమా పేరేంటి?
ఎ) ఖైదీ నంబరు 150 బి) గౌతమిపుత్ర శాతకర్ణిసి) బాహుబలి డి) శతమానం భవతి
► బి.గోపాల్ దర్శకత్వంలో రిలీజైన ‘ఆరడుగుల బుల్లెట్’చిత్రంలో నటించిన హీరోయిన్ ఎవరు? ఈ టాప్ హీరోయిన్‌కి తెలుగులో ఈ సంవత్సరం ఇదొక్కటే రిలీజు?
ఎ) అనుష్క బి) నయనతార సి) శృతిహాసన్ డి) అమలాపాల్
► ‘ఘాజీ’ చిత్రం ద్వారా 2017వ సంవత్సరంలో పరిచయమైన దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) సంకల్ప్‌రెడ్డి బి) వివేక్ ఆత్రేయ సి) గౌతమ్ డి) వెంకీ అట్లూరి
► ‘అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలో నటించింది లక్ష్మీరాయ్. కానీ ఈ పాటకు మొదట వేరే హీరోయిన్‌ను అనుకున్నారు. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
ఎ) తాప్సీ బి) క్యాథరిన్ థెరిసా సి) కాజల్ అగర్వాల్ డి) కంగనా రనౌత్
► ఈ సంవత్సరం జరిగిన ‘బాలల చలన చిత్రోత్సవంలో’ స్క్రీనింగ్ జరిగిన ‘అప్పూ’ చిత్రం ద్వారా తెలుగు తెరపై మెరిసిన బాల నటుడు ఎవరు?
ఎ) నాగాన్వేష్ బి) సాయి శ్రీవంత్ సి) అనిరుథ్ డి) అన్వేష్
► బడిలో గుడిలో’ అంటూ అల్లు అర్జున్‌తో స్టెప్పులేసిన భామ ఎవరు?
ఎ) నివేధా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) పూజా హెగ్డే డి) కీర్తీ సురేశ్
► 2017వ సంవత్సరానికి ఎనిమిది తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) మణిశర్మ బి) యస్.యస్. తమన్ సి) అనూప్ రూబెన్స్ డి) దేవిశ్రీ ప్రసాద్
► ఈయన డాక్టర్ చదువుకున్నాడు. కానీ నటుడవ్వలేదు. 2017వ సంవత్సరంలో సంచలన దర్శకుడయ్యాడు. ఆయన పేరేంటి?
ఎ) సందీప్‌రెడ్డి బి) రామ్‌గణపతి సి) రవికాంత్ పేరేపు డి) అర్జున్‌రెడ్డి
► ఈ సంవత్సరం 25 సినిమాలను కంప్లీట్ చేసుకున్న నటుడెవరో కనుక్కోండి?
ఎ) అల్లరి నరేశ్ బి) శర్వానంద్ సి) రామ్ డి) నాని
► ప్రపంచవ్యాప్తంగా ఈ ఇయర్ సందడి చేసిన ‘బాహుబలి–2’ చిత్రానికి కెమెరామేన్ ఎవరో తెలుసా?
ఎ) చోటా కె.నాయుడు బి) రత్నవేలు సి) కె.కె. సెంథిల్‌కుమార్ డి) ఆయాంకా బోస్
► 2017 సంవత్సరంలో తండ్రిగా ప్రమోషన్ కొట్టేసిన ప్రముఖ హీరో ఎవరు?
ఎ) అల్లు అర్జున్ బి) నాని సి) ఎన్టీఆర్ డి) గోపీచంద్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1. ఎ, 2. డి, 3. బి, 4. సి, 5. సి 6. బి, 7. ఎ, 8. బి, 9. బి, 10. డి 11. బి, 12. ఎ, 13. బి, 14. బి 15. సి, 16. డి, 17. ఎ 18. బి, 19. సి, 20. బి
Comments
Please login to add a commentAdd a comment