ChaySam Divorce: Kangana Ranaut Shocking Comments On Samantha Naga Chaitanya Divorce - Sakshi
Sakshi News home page

ChaySam Divorce: విడాకులకు కారణం ఆ స్టార్‌ హీరోనే.. కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

Published Sun, Oct 3 2021 11:13 AM | Last Updated on Sun, Oct 3 2021 4:00 PM

Kangana Ranaut Reacts to Samantha Naga Chaitanya Divorce - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్ నాగచైతన్య-సమంతల విడాకులు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ అభిమానులు అంతగా నమ్మలేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యే బోలెడన్ని వదంతుల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుందని భావించారు. కానీ ఆ పుకార్లనే నిజం​ చేస్తూ తాము విడాకులు తీసుకోతున్నట్లు చై-సామ్‌ శనివారం వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విడిపోవడం అటు అక్కినేని అభిమానులకు, ఇటు సామ్‌ ఫ్యాన్స్‌కి మింగుడుపడటం లేదు. సోషల్‌ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ తమకు ఇష్టమొచ్చిచ్చినట్లుగా విశ్లేషణ చేస్తున్నారు.
(చదవండి: ChaySam Divorce: ప్రేమకు గుర్తుగా టాటూలు...ఇప్పుడు విడాకులు!)

ఇక అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్‌  కంగనా రనౌత్‌(Kangana Ranaut) మరో ఆసక్తికర చర్చకు తెర తీసింది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఓ బాలీవుడ్‌ హీరోనే కారణమంటూ షాకింగ్‌ పోస్ట్‌ చేసింది. ‘10 ఏళ్లుగా ప్రేమ బంధంలో ఉండి, నాలుగేళ్లుగా వివాహా బంధంలో ఉండి.. విడాకులు తీసుకున్న ఓ సౌత్‌ ఇండియా హీరో.. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోతో పరిచయమ్యారు. ఆ బాలీవుడ్‌ హీరోకు విడాకుల స్పెషలిస్ట్‌గా పేరుంది. అతను ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. ఆయన సూచనలు, సలహాల మేరకే సౌత్‌ హీరో విడాకుల నిర్ణయం తీసుకున్నాడు’అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో కామెంట్‌ చేసింది.

దీంతో పాటు  ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై కూడా కంగనా కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమిర్‌ ఖాన్‌ను ఉద్దేశించే కంగనా ఆ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. కాగా, నాగచైతన్య ఇటీవల బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌తో కలిసి లాల్‌ సింగ్ చద్దా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement