After 16 Years Trisha To Reunite With Mega Star Chiranjeevi On Screen For His Next, Deets Inside - Sakshi
Sakshi News home page

Trisha In Chiranjeevi Movie: పదహారేళ్ల తర్వాత...

Published Thu, Jun 29 2023 3:36 AM | Last Updated on Thu, Jun 29 2023 8:53 AM

After 15 years Trisha To Share Screen Space With Mega Star Chiranjeevi - Sakshi

పదహారేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారని తెలిసింది. చిరంజీవి హీరోగా, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయట.

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల నటించనున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారని, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇక 2006లో వచ్చిన ‘స్టాలిన్‌’ చిత్రం తర్వాత చిరంజీవి, త్రిష మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement