
అవునండీ... ఇప్పుడు త్రిష డాక్టర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవలను గుర్తించి ఏదైనా యూనివర్శిటీ డాక్టరేట్ ఇచ్చి ఉంటుందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. గౌరవ డాక్టరేట్ కాదు.. నిజమైన డాక్టర్. తన దగ్గరకు వచ్చే పేషెంట్స్‌ని ఆరోగ్యవంతులను చేసి, ఇంటికి పంపించడమే ఈ డాక్టర్ లక్ష్యం. కాకపోతే రియల్‌గా కాదు... రీల్‌పై డాక్టర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే చేతిలో ఐదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారామె. ఇప్పుడు ఆరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టైటిల్ ‘పరమపదమ్’. ఇందులోనే త్రిష డాక్టర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. ఒకవైపు విజయ్ సేతుపతి సరసన ‘96’లో, ‘సామి–2’లో విక్రమ్‌తో, ‘హే జ్యూడ్’ అనే మలయాళ సినిమాలో నివిన్ పౌలి సరసన, ‘1818’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘పరమపదమ్’ సినిమా మొత్తం త్రిష పాత్ర చుట్టూనే ఉంటుంది. తిరుజ్ఞానం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికి త్రిష హీరోయిన్ అయ్యి, 17 ఏళ్లు. ఇన్నేళ్లయినా ఇంకా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారంటే గ్రేటే. ఈ జనరేషన్ హీరోయిన్స్‌కి ఇన్నేళ్ల కెరీర్ అంటే మాటలు కాదు. అందుకే త్రిష సూపర్.
Comments
Please login to add a commentAdd a comment