![Hansika My Name Is Shruthi Movie Will Release Soon - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/30/Hansika%20%281%29.jpg.webp?itok=Wlr-Zy-5)
హన్సిక
హన్సిక టైటిల్ రోల్‌లో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మార్క్ కె. రాబిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పోరాటం పోరాటం..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, హారిక నారాయణన్, సత్య యామిని ఆలపించారు.
శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రంలో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే శృతిగా విభిన్నమైన పాత్ర చేశాను. ఆద్యంతం మలుపులతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది’’ అన్నారు హన్సిక. ఈ చిత్రానికి కెమెరా: కిశోర్ బోయిడపు, సహనిర్మాత: పవన్‌కుమార్ బండి.
Comments
Please login to add a commentAdd a comment