Title Role
-
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
నాలుగేళ్లు పరిశోధన చేశాను
హన్సిక టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఓంకార్ శ్రీనివాస్ దర్శకత్వంలో బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఓంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలకు దర్శకత్వ విభాగంలో చేసిన నాకు ‘మై నేమ్ ఈజ్ శృతి’ దర్శకుడిగా తొలి చిత్రం. ఓ అమ్మాయి జీవితంలో జరిగిన వాస్తవ ఘటన స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రకథ రాసుకున్నాను. స్కిన్ మాఫియా గురించిన స్క్రీన్‌ప్లే బేస్డ్ ఫిల్మ్ ఇది. హన్సికగారి అమ్మగారు స్కిన్ డాక్టర్ కావడంతో ఈ కథకు హన్సికగారు బాగా కనెక్ట్ అయ్యారు. జీవితంలో ఓ కలను నిజం చేసుకునేందుకు గ్రామం నుంచి సిటీకి వచ్చిన శృతి (హన్సిక పాత్ర పేరు) స్కిన్ మాఫియా ట్రాప్‌లో ఎలా చిక్కుకుంది? ఆ తర్వాత తనను తాను ఏ విధంగా కాపాడుకోగలిగింది? అనేది ఈ చిత్రం కథాంశం. మగవారికంటే మహిళలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారని, పెప్పర్ స్ప్రేలు లేకపోయినా తలలో ఉండే ఓ సేఫ్టీ పిన్‌తో కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోగలరని ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా కోసం నాలుగేళ్లు పరిశోధన చేశాను’’ అని అన్నారు. -
పోరాటం.. పోరాటం..
హన్సిక టైటిల్ రోల్లో నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్యా ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మార్క్ కె. రాబిన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పోరాటం పోరాటం..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, హారిక నారాయణన్, సత్య యామిని ఆలపించారు. శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రంలో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే శృతిగా విభిన్నమైన పాత్ర చేశాను. ఆద్యంతం మలుపులతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది’’ అన్నారు హన్సిక. ఈ చిత్రానికి కెమెరా: కిశోర్ బోయిడపు, సహనిర్మాత: పవన్‌కుమార్ బండి. -
చెన్నైకు బంగారం
బాబు బంగారంలాంటోడు. అందుకే ఆ బాబంటే అందరికీ ఇష్టం. మరి.. ఈ బాబు ఏం చేస్తాడు? అసలు బంగారం అని ఎందుకు అనిపించుకుంటాడు? అనేది ‘బాబు బంగారం’లో చూడాల్సిందే. టైటిల్ రోల్లో వెంకటేశ్ నటిస్తుండగా, ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి పాటను చెన్నైలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జూలై 4 నుంచి 8 వరకూ చిత్రీకరించనున్నారు. జిబ్రాన్ స్వరపరిచిన పాటలను అదే నెల 9న, సినిమాని 29న విడుదల చేయాలనుకుంటున్నారు. -
సీబీఐ ఆఫీసర్‌గా...
కొంత విరామం తర్వాత మళ్లీ నమిత తెలుగు తెరపై కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఘని’ ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చిత్ర ఉపశీర్షిక ‘గాడ్సే కాదు’. టైటిల్ రోల్ పోషిస్తూ అదీబ్ నజీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నమిత శక్తిమంతమైన సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశంతో, దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కొన్ని యథార్థ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది. నమిత పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. షఫీ, వైభవ్ సూర్య, మనీషా పిళ్లే, నంద హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీఐ పాత్రను బెనర్జీ పోషిస్తున్నారు. -
దోష నివారణకు పూజలు!
జరగకూడనిది ఏదైనా జరిగినప్పుడు.. ఎవరైనా కంగారుపడతారు. రకరకాల సందేహాలు, భయాలు కలుగుతుంటాయి. ఏదైనా దోషం వల్లే ఇలా జరిగిందేమో అని కూడా అనుకుంటారు. ఇటీవల అనుష్క అలానే అనుకున్నారట. అందుకే, రుద్రమదేవికి పూజలు నిర్వహించారు. తెలుగు, తమిళం భాషలలో భారీ ఎత్తున రూపొందుతున్న చారిత్రక కథా చిత్రం ‘రుద్రమదేవి’లో అనుష్క టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో ఆమె సహజత్వం కోసం ఖరీదు గల బంగారు నగలు ధరించి నటించారు. కాగా.. ఆ నగలు షూటింగ్ లొకేషన్లో తస్కరణకు గురైన విషయం తెలిసిందే. దీంతో చిత్రబృందం దిగ్భ్రాంతికి గురయ్యారు. నగలు మాయమైన వ్యవహారంలో చిత్రం యూనిట్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా నగలు దోపిడీకి గురి కావడం అనుష్కను కలచి వేసిందట. దీని గురించి అనుష్క మాట్లాడుతూ.. ‘‘ఆ నగలను చాలా జాగ్రత్తగా భద్రపరుస్తూ వచ్చాం. అయినా అవి మాయమవడం బాధాకరం. దోషం కారణంగానే నగలు మాయమయ్యాయని కొందరు అంటున్నారు. దీంతో ఏమైనా విపరీతం జరుగుతుందనే భయం కలిగింది. అందువలనే రుద్రమదేవి ఆలయంలో మొక్కుకుని దోష నివారణకు పూజలు నిర్వహించాను’’ అని చెప్పారు.