సీబీఐ ఆఫీసర్‌గా... | namitha cbi officer role in new movie | Sakshi
Sakshi News home page

సీబీఐ ఆఫీసర్‌గా...

Jan 10 2015 11:29 PM | Updated on Sep 2 2017 7:30 PM

సీబీఐ ఆఫీసర్‌గా...

సీబీఐ ఆఫీసర్‌గా...

కొంత విరామం తర్వాత మళ్లీ నమిత తెలుగు తెరపై కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఘని’ ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి

 కొంత విరామం తర్వాత మళ్లీ నమిత తెలుగు తెరపై కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఘని’ ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చిత్ర ఉపశీర్షిక ‘గాడ్సే కాదు’. టైటిల్ రోల్ పోషిస్తూ అదీబ్ నజీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నమిత శక్తిమంతమైన సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశంతో, దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కొన్ని యథార్థ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది. నమిత పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. షఫీ, వైభవ్ సూర్య, మనీషా పిళ్లే, నంద హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీఐ పాత్రను బెనర్జీ పోషిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement