CBI officer
-
కొవ్విరెడ్డితో సంబంధం లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొవ్విరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తితో తనది కేవలం రెండు గంటల పరిచయం మాత్రమేనని, అంతకుమించి ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల సీబీఐ అధికారులు అరెస్టు చేసిన శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడని, మున్నూరు కాపు సంఘంలో తిరుగుతాడని, ఐపీఎస్ అని విన్నానని తెలిపారు. అంతేతప్ప తానెప్పుడూ ప్రత్యక్షంగా అతన్ని కలుసుకోలేదని అన్నారు. అయితే ఇటీవల అరెస్టుకు వారం రోజుల ముందు ధర్మేందర్ అనే వ్యక్తి ద్వారా ఫిల్మ్‌నగర్‌లో జరిగిన ఓ గెట్ టు గెదర్‌లో శ్రీనివాసరావును కలిశానని చెప్పారు. శ్రీనివాస్ మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ అని గర్వంగా ఫీలయ్యామని, అతడి భార్య కూడా ఐఏఎస్ అని చెప్పడంతో వారిని కలిసేందుకు ధర్మేందర్ ద్వారా వెళ్లామన్నారు. ఆ సందర్భంగానే ఫొటోలు దిగడం జరిగిందని తెలిపారు. తనను అతను ఎలాంటి పనులు అడగడం కానీ, తాను అతడిని అడగటం కానీ జరగలేదని అన్నారు. మరుసటి రోజు గంటపాటు మామూలుగా మాట్లాడామే తప్ప అంతకుమించి ఏమీ లేదని పేర్కొన్నారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన సమయంలో అతని ఫోన్లో తన ఫొటోలతో పాటు కాల్‌లిస్టులో పేరు ఉండటంతో విచారణకు పిలిచారని వివరించారు. తన బావ, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి సాయం అడిగాడని, దాంతో రూ.15 లక్షల విలువైన ఆభరణాలు ఇప్పించాడని, ఆ డబ్బుల బకాయి ఇంకా ఉందని చెప్పారు. శ్రీనివాస్‌తో తామెలాంటి లావాదేవీలు జరపలేదని, సీబీఐ అధికారులకు ఇదే స్పష్టం చేశామని అన్నారు. -
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు గురించి విస్తుపోయే విషయాలు
-
నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా ఢిల్లీలో మకాం వేసిన శ్రీనివాస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ మోసాలు చేస్తున్నట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సీబీఐ, ఈడీ కేసులను సెటిల్మెంట్లు చేయిస్తానని వసూళ్లు చేసినట్లు తెలిపింది. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్ భవన్లను అడ్డగా చేసుకొని ఈ దందాలకు పాల్పడినట్లు వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీలో పనులు చక్కబెట్టి కోట్లలో రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే నకిలీ అధికారిపై పలు కేసులు నమోదు కాగా.. ఏపీసీ 419, 420 కింద కేసులు నమోదు చేసింది. గత నెల 26న సీబీఐ ఏసీబీ వింగ్ శ్రీనివాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: సీబీఐ విచారణకు హాజరైన మంత్రి గంగుల సీబీఐ సీనియర్ ఆఫీసర్నని చెప్పి యూసుఫ్ గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడిని మోసం చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీలో వినయ్ హాండా కుమారుడికి సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు పేర్కొంది. మార్గానా వెంకటేశ్వర రావు, రవికి చెందిన 2000 వాహనాలను ఢిల్లీలో నో ఎంట్రీ స్థలంలోకీ అనుమతించేలా పోలీసులతో మాట్లాడాతానని పైసలు వసూలు చేసినట్లు వెల్లడించింది. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలంటూ బాధితుల వద్ద భారీ ఎత్తున డబ్బు దండుకున్నట్లు తెలిపింది. కాగా సీబీఐ అధికారిగా చలామణీ అవుతూ పనులు చేయిస్తానని చెప్పి అనేకమంది దగ్గర డబ్బులు దండుకుంటున్న శ్రీనివాస్‌ని మూడు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని చినవాల్తేరు కిర్లంపూడికి కు చెందిన ఇతన్ని ఢిల్లీలోని తమిళనాడు భవన్ల్ సీబీఐ అధికారులు అతుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ అధికారినని, సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతుండటంతో అధికారులు అతన్ని పట్టుకున్నారు. -
వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారి బదిలీ
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి సుధాసింగ్ బదిలీ అయ్యారు. ఈ నెల 24న ఆమె విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో రామ్‌కుమార్ అనే ఎస్పీ స్థాయి అధికారి నియమితులయ్యారు. ఆదివారం కడపకు వచ్చిన ఆయన కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివేకా హత్య కేసులో మరికొంతమందిని సీబీఐ అధికారుల బృందం సోమవారం నుంచి విచారించనుంది. -
సోషల్ మీడియా పోస్ట్.. రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. ట్విస్ట్ ఏంటంటే
కోల్‌కతా: ఒక వ్యక్తి తాను.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ అధికారినంటూ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాస్త వైరల్ గా మారింది. దీంతో అతడిని కలకత్తా పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు, సనాతన్ రే అనే వ్యక్తి కోల్కత్తా హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయన గతకొంత కాలంగా తన ఫేస్బుక్లో.. తాను సిబీఐ అధికారినంటూ నకిలీ ప్రోఫైల్ తయారు చేశాడు. అంతటితో ఆగకుండా, సిబీఐ అధికారులకు మాత్రమే ఉండే నీలిరంగు టాగ్‌ను తన వాహనానికి పెట్టుకున్నాడు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ లో పనిచేస్తున్నట్లు పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో, కోల్కత్తా స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్(సిట్) సనాతన్రేను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, సనాతన్ రే హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నట్లు బయట పడింది. దీంతో, సిబీఐ అధికారినంటూ మోసంచేశాడని సిట్ విచారణలో తెలింది. కాగా, సిట్ అధికారులు, సనాతన్రే పై.. ప్రభుత్వాధికారినంటూ మోసం చేయడం, ఫోర్జరీ, నేర పూరిత చర్య వంటి పలు అభియోగాల కింద కేసులను నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మాల్యా కేసు : టాప్ సీబీఐ ఆఫీసర్‌పై ఆరోపణలు
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంలో ఒక్కొక్కరూ బుక్కవుతున్నారు. తాను దేశం విడిచి పారిపోవడం అరుణ్ జైట్లీకి తెలుసని మూడు రోజుల క్రితం విజయ్ మాల్యా వెల్లడించగా.. సీబీఐ అధికారుల అలసత్వం ప్రదర్శించడంతోనే మాల్యా పరారైనట్టు నిన్న సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే ఆరోపించారు. తాజాగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ వల్లే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోగలిగాడని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. మాల్యా కోసం ఇచ్చిన లుక్ ఔట్ నోటీసులను ఆయన బలహీనపరిచే పారిపోయేందుకు కారణమయ్యారని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.ఇదే అధికారి నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీల పరారీ ప్రణాళికల కోసం పని చేశారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకంగా చూసే శర్మ గుజరాత్ కేడర్ అధికారని విపక్ష నేత విమర్శించారు. వూప్సూ... ఇన్వెస్టిగేషన్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. CBI Jt. Director, A K Sharma, weakened Mallya’s “Look Out” notice, allowing Mallya to escape. Mr Sharma, a Gujarat cadre officer, is the PM’s blue-eyed-boy in the CBI. The same officer was in charge of Nirav Modi & Mehul Choksi’s escape plans. Ooops... investigation! — Rahul Gandhi (@RahulGandhi) September 15, 2018 అయితే ఈ ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారమని పేర్కొంది. ‘సీబీఐ సీనియర్ అధికారులపై కొంతమంది వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి లేదా అదుపులోకి తీసుకోవడానికి అప్పటికీ సీబీఐ వద్ద అవసరమైన ఆధారాలు లేవు. ఆ కారణంతోనే మాల్యాకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును మార్చాలని నిర్ణయం తీసుకున్నాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో ప్రధాని ఆమోదం లేకుండా లుక్ ఔట్ నోటీసులను సీబీఐ మార్చడం ఎలా సాధ్యమని రాహుల్ సంధించిన ప్రశ్నలపై సీబీఐ అధికారి ఈ విధంగా స్పందించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి వ్యవహారంపై కూడా స్పందించిన సీబీఐ అధికార ప్రతినిధి... ‘వారు దేశం విడిచి పారిపోయిన నెల తర్వాత సీబీఐకు నీరవ్, చోక్సిల విషయంపై పీఎన్బీ నుంచి ఫిర్యాదు పొందింది. వారు దేశం విడిచి పారిపోవడానికి సీబీఐ అధికారి కారణం అనడానికి ఎలాంటి ఆధారం లేదు. బ్యాంక్ నుంచి ఫిర్యాదు పొందిన వెంటనే, సీబీఐ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది’ అని తెలిపారు. ఏకే శర్మ ప్రస్తుతం అదనపు డైరెక్టర్ విభాగం, అవినీతి నిరోధక యూనిట్లలో పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన కేసుల మాత్రమే ఆయన చూసుకుంటారు. శర్మ, గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. -
సీబీఐ ఆఫీసర్‌గా..
సింగిల్ లాంగ్వేజ్‌లో సినిమాలు చేయడం రానాకు కిక్ ఇవ్వదేమో! తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంటారాయన. ‘బాహుబలి’కి ముందు ముచ్చటిది. ‘బాహుబలి’తో మలయాళంలోనూ రానాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఒక్క సినిమాతో నాలుగు భాషలపై గురి పెట్టారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం ఆధారంగా ‘ఆస్ఫోట – ద హ్యూమన్ బాంబ్’ అనే సినిమా తీయనున్నట్టు కన్నడ దర్శకుడు ఏయమ్మార్ రమేశ్ గతేడాది ప్రకటించారు. ఇందులో రాజీవ్ హత్య కేసును ఇన్వేస్టిగేషన్ చేసిన సీబీఐ ఆఫీసర్ డీఆర్ కార్తికేయన్‌గా రానా నటించడం దాదాపు ఖాయమే. రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక ఎల్టీటీఈ సంస్థ హస్తం ఉందనేది తెలిసిందే. ఈ నిజాలను సీబీఐ ఆఫీసర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? వాళ్లను ఎలా రౌండప్ చేశాడు? అనే కథతో సినిమా తీస్తారట. దర్శకుణ్ణి రెండుమూడు సార్లు కలసిన రానా కథ, అతని పాత్ర తీరుతెన్నుల గురించి చర్చించారు. ముందు ఈ సినిమాను కన్నడ, తమిళ భాషల్లో తీయాలనుకున్నారు. ఇప్పుడు రానా చేరికతో తెలుగు, హిందీలతో కలిపి నాలుగు భాషల్లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ చేసేటప్పుడే ‘నేనే రాజు–నేనే మంత్రి’, తెలుగు–తమిళ సినిమా ‘1945’ అంగీకరించారు. -
సీబీఐ ఆఫీసర్‌గా...
కొంత విరామం తర్వాత మళ్లీ నమిత తెలుగు తెరపై కనిపించనున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఘని’ ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చిత్ర ఉపశీర్షిక ‘గాడ్సే కాదు’. టైటిల్ రోల్ పోషిస్తూ అదీబ్ నజీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నమిత శక్తిమంతమైన సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశంతో, దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కొన్ని యథార్థ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసుకున్న కథ ఇది. నమిత పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చెప్పారు. షఫీ, వైభవ్ సూర్య, మనీషా పిళ్లే, నంద హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సీఐ పాత్రను బెనర్జీ పోషిస్తున్నారు. -
బాలకృష్ణ 'లయన్' స్టిల్స్
-
బాలయ్య 99 వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం?
చెన్నై: నందమూరి బాలకృష్ణ 99వ చిత్రానికి స్క్రిప్ట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లయన్ చిత్ర షూటింగ్ లో ఉండగానే తదుపరి ప్రాజెక్టుకు బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ లు మాటలు అందిస్తున్నారని సినీ వర్గాల భోగట్టా. గతవారమే ఒక కథను బాలకృష్ణ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే లయన్ పూర్తి అయిన తరువాత బాలయ్య 99 వ చిత్రం సెట్స్ పై కి వెళ్లనుంది. -
లయన్గా బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తోన్న చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే కథానాయకులు. -
చిత్తూరులో నకిలీ సీబీఐ అధికారి!