
చెన్నైకు బంగారం
బాబు బంగారంలాంటోడు. అందుకే ఆ బాబంటే అందరికీ ఇష్టం. మరి.. ఈ బాబు ఏం చేస్తాడు? అసలు బంగారం అని ఎందుకు అనిపించుకుంటాడు? అనేది ‘బాబు బంగారం’లో చూడాల్సిందే. టైటిల్ రోల్‌లో వెంకటేశ్ నటిస్తుండగా, ఆయన సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి పాటను చెన్నైలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జూలై 4 నుంచి 8 వరకూ చిత్రీకరించనున్నారు. జిబ్రాన్ స్వరపరిచిన పాటలను అదే నెల 9న, సినిమాని 29న విడుదల చేయాలనుకుంటున్నారు.