'బాబు బంగారం' భారీ కలెక్షన్లు | Babu Bangaram box office collection: Venkatesh's film mints Rs 25 crore in 4 days | Sakshi
Sakshi News home page

'బాబు బంగారం' భారీ కలెక్షన్లు

Published Thu, Aug 18 2016 6:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

'బాబు బంగారం' భారీ కలెక్షన్లు

'బాబు బంగారం' భారీ కలెక్షన్లు

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన 'బాబు బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్  రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లో రూ. 25 కోట్లు కలెక్షన్లు సాధించింది. వెంకటేశ్ సోలోగా నటించిన సినిమాకు భారీస్థాయిలో చాలా కాలం తర్వాత వసూళ్లు వచ్చాయని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. నాలుగు రోజుల వీకెండ్ లో ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్, రూ. 17 కోట్ల షేర్ సాధించిందని వెల్లడించారు.

తమ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంపై నిర్మాత నాగవంశీ సంతోషం వ్యక్తం చేశారు. 'బాబు బంగారం'కు స్పందన బాగుందని, తమ సినిమా విజయవంతం అయిందనడానికి వసూళ్లే నిదర్శనమని అన్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదలైంది. వెంకటేశ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement