డాక్టర్‌ త్రిష | Trisha plays a doctor in Paramapadham Vilayattu | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ త్రిష

Published Thu, Mar 28 2019 2:52 AM | Last Updated on Thu, Mar 28 2019 2:52 AM

Trisha plays a doctor in Paramapadham Vilayattu - Sakshi

ఒకరికి మంచి చేయాలని ప్రయత్నించి తాను చిక్కుల్లో పడ్డారు త్రిష. ఆమెను కిడ్నాప్‌ చేసి ఓ అజ్ఞాత ప్రదేశంలోని ఓ భవంతిలో దాచారు. అక్కడి నుంచి త్రిష ఎలా బయటపడ్డారు? అందుకు ఎలాంటి సాహసాలు చేశారు అనే అంశాలను ‘పరమపదమ్‌ విలైయాట్టు’ అనే సినిమాలో చూడొచ్చు. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఒరియంటెడ్‌ సినిమా ఇది. తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాక్టర్‌ పాత్రలో కనిపిస్తారు త్రిష. మరి.. డాక్టర్‌గా ఆమె చేయబోయిన హెల్ప్‌ ఏంటి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

ఆల్మోస్ట్‌ టాకీ పార్ట్‌ పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమా కాబట్టి తక్కువ పాటలే ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమాలో త్రిష చేసే యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. అలాగే సిమ్రాన్, త్రిష ముఖ్య తారలుగా సుమంత్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీలో అమితాబ్‌ బచ్చన్, తాప్సీ నటించిన హిట్‌ మూవీ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటించబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. రాధామోహన్‌ దర్శకత్వం వహిస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement