96 కాదు 99 | Bhavana to play Trisha's role in Kannada remake of '96' | Sakshi
Sakshi News home page

96 కాదు 99

Published Sat, Dec 15 2018 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

Bhavana to play Trisha's role in Kannada remake of '96' - Sakshi

భావన

ఈ ఏడాది తమిళనాట సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘96’ ఒకటి. విజయ్‌ సేతుపతి, త్రిష నటించిన ఈ మ్యాజికల్‌ లవ్‌ స్టోరీ వేరే ఇండస్ట్రీల్లోనూ రీమేక్‌ అవుతోంది. తెలుగులో ఈ చిత్రం హక్కులను నిర్మాత ‘దిల్‌’ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ చిత్రం కన్నడంలోనూ రీమేక్‌ కానుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మలయాళ నటి భావన ఈ చిత్రం ద్వారా కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నారు. గణేశ్, భావన ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి ‘99’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement