
త్రిష, మోహన్‌లాల్
‘‘రామ్’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామ్’. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సమయంలోనే మరో కథ రాయడం మొదలుపెట్టారు జీతూ. దీంతో ‘రామ్’ చిత్రం క్యాన్సిల్ అయినందువల్లనే జీతూ కొత్త కథపై పని మొదలుపెట్టారనే టాక్ మొదలైంది. ఈ విషయంపై ఇటీవలే జీతూ స్పందించారు.
‘‘కరోనా వల్ల ‘రామ్’ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. యూకే, ఉజ్బెకిస్తాన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ తగ్గిన తర్వాత తిరిగి ప్రారంభిస్తాం. కరోనా వైరస్‌ను బాగా కట్టడి చేసిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. సో.. కేరళలోనే మొత్తం షూటింగ్ జరిపేలా ప్రస్తుతం ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమాను ప్లాన్ చేయడం వల్ల ‘రామ్’ సినిమా రద్దయిందని కాదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నాం.. అంతే’’ అని పేర్కొన్నారు జీతూ.
Comments
Please login to add a commentAdd a comment