
త్రిష
పదిహేనేళ్లకు పైగా హీరోయిన్ పాత్రలు చేస్తున్న నటి త్రిష ఇప్పటివరకు మలయాళంలో చేసింది మాత్రం ఒక్క సినిమాయే. గతేడాది ‘హే జూడ్’ చిత్రంతో ఆమె మలయాళంలో తొలి అడుగు వేశారు. ఈ సినిమాలో త్రిష నటనకు అక్కడ మంచి మార్కులే పడ్డాయి. అందుకే మాలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామ్’ అనే చిత్రంలో త్రిషను కథానాయికగా తీసుకున్నారు. ఇందులో మోహన్‌లాల్ చేస్తున్న రామ్ పాత్రకు భార్యగా త్రిష కనిపిస్తారు. వచ్చే ఏడాది ఓనమ్ పండగకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ‘పొన్నియిన్ సెల్వన్’, చిరంజీవి –కొరటాల కాంబినేషన్ సినిమాల్లో త్రిష ఒక కథానాయికగా నటించబోతున్నారని తెలిసింది. సో.. వచ్చే ఏడాది త్రిష బిజీ అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment