ఈజీ అనాలి కదా.. వీజీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? కొంచెం ఎటకారంగా.. అదేనండీ వెటకారంగా చెప్పాలంటే వీజీ అంటారు కదా. ఒక విషయం గురించి త్రిష ఇలా వ్యంగ్య ధోరణిలోనే మాట్లాడారు. అదేంటంటే... ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఏదైనా కామెంట్ పెట్టి, దానికి తగ్గట్టు సెలబ్రిటీల ఫొటోలు పెడుతుంటారు కదా. ఆ ఫొటోలో స్టార్ ఎక్స్‌ప్రెషన్ ఆ కామెంట్‌కి తగ్గట్టుగా ఉంటుంది. త్రిష ఫొటోలు ఇలాంటివి చాలానే వైరల్ అయ్యాయి.
‘‘కొన్ని బాగానే ఉంటాయి. కొన్ని ఫొటోలు, కామెంట్స్ మాత్రం బాగుండవు. అలాంటివి చూసి, బాధపడతారా? అని నన్నడిగితే.. ‘అస్సలు బాధపడను’ అని చెబుతా. నన్ను బాధపెట్టడం అంత వీజీ కాదు’’ అన్నారు త్రిష. స్టార్ అయ్యాక ఇలాంటివి కామన్ కాబట్టి, అలవాటై త్రిష లైట్ తీసుకున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. నటి కాకముందు కూడా ఇలానే ఉండేవారట. ఆ విషయం గురించి త్రిష చెబుతూ – ‘‘నా గురించి ఎవరైనా చేయకూడని కామెంట్ చేస్తే పట్టించుకునేదాన్ని కాదు.
బాధపడేదాన్ని కాదు. ఒకవేళ తట్టుకోలేనంత బాధ అనిపిస్తే.. అప్పుడు మా అమ్మకి, ఫ్రెండ్స్‌కి చెబుతాను. అంతా విని, వాళ్లు ఒక్కసారిగా నవ్వేస్తారు. అప్పుడా బాధ జోక్ అయిపోతుంది’’ అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం త్రిష చేస్తోన్న వాటిలో మలయాళ చిత్రం ‘హే జ్యూడ్’ ఒకటి. ఈ చెన్నై చందమామ ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment