అమరన్‌కు సాయిపల్లవి డబ్బింగ్‌ | Sai Pallavi dubs for 'Amaran' in Mumbai | Sakshi
Sakshi News home page

అమరన్‌కు సాయిపల్లవి డబ్బింగ్‌

Published Sat, Aug 10 2024 1:06 PM | Last Updated on Sat, Aug 10 2024 1:06 PM

Sai Pallavi dubs for 'Amaran' in Mumbai

వైవిధ్యభరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటి సాయిపల్లవి. పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఒక్కో చిత్రంలో ఒక్కో రకమైన పాత్రలో నటిస్తూ తన ఇమేజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. మలయాళ చిత్రం ప్రేమమ్‌లో ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా నటించి తన ప్రత్యేకతను చాటుకున్న సాయిపల్లవి ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ ఉన్నతస్థాయికి ఎదిగారు. 

ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించే స్థాయికి ఎదిగారు. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్‌ చిత్రాన్ని నటుడు కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఒక యథార్థ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్‌ను అధిక భాగం కశీ్మర్‌లో రూపొందించారు. 

షూటింగ్‌ను పూర్తిచేసుకున్న అమరన్‌ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దీంతో డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తన పాత్రకు సాయిపల్లవి డబ్బింగ్‌ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న తెరపైకి రానుంది. కాగా ఈచిత్రంతో పాటు తెలుగులో నాగచైతన్యకు జంటగా తండేల్, హిందీలో రామాయణం చిత్రంలో సీతగానూ సాయిపల్లవి నటిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement