
ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అవలీలగా తెలుగు మాట్లాడారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా ఆమె తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలోని తనపాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆమె మాతృభాష తెలుగు కాదు. అయినప్పటికీ కష్టపడి తెలుగు నేర్చుకొని తనపాత్రకు డబ్బింగ్ చెప్పి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారామె.
ఆమె అంకితభావం ప్రశంసనీయం అని చిత్రబృందం పేర్కొంది. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.