‘‘నటి అవ్వాలనుకున్నప్పుడు భవిష్యత్ ఎలా ఉంటుందా అనిపించింది. దీనికి తోడు కొందరు కెరీర్‌లో వేగంగా ముందుకు వెళ్తుంటారు. వారిలా అవకాశాలు నాకు ఎప్పుడు వస్తాయా? అనే ఆలోచన కూడా ఉండేది. అయితే ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నేను వేదికపైకి రాగానే ప్రేక్షకులు చేసిన హంగామా, ఈలలు చూసి నాకు అమితానందం కలిగింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లొచ్చాయి (ఆనందంతో..)’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే చెప్పిన సంగతులు.
⇒ నా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా నైజీరియాలోని లాగోస్‌కు షిఫ్ట్ అయ్యాం. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టడీస్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యుయేషన్లో ఉండగానే మోడలింగ్ చేయమని నన్ను చాలామంది ప్రోత్సహించడంతో ట్రై చేద్దామనుకున్నాను. ఈ ఫీల్డ్ నాకు బాగా నచ్చింది. మెల్లిగా కెమెరా భయం కూడా ΄ోయింది. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను
⇒ ‘మిస్టర్ బచ్చన్’లో తెలుగు మార్వాడీ అమ్మాయి జిక్కీపాత్రలో కనిపిస్తాను. కథలో జిక్కీపాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మిస్టర్ బచ్చన్ (రవితేజపాత్ర)ను మోటివేట్ చేసేలా నా రోల్ ఉంటుంది. అయినా మహిళలు లేకుండా ఏ కథ పూర్తి కాదని నా అభి్ర΄ాయం. తెలుగు భాష మీద పట్టు సాధించి, జిక్కీపాత్రకు నేనే డబ్బింగ్ చెబుతానని హరీష్ శంకర్‌గారిని అడిగితే ఆయనప్రోత్సహించారు
⇒ హీరోగా రవితేజగారికి చాలా అనుభవం ఉంది. కానీ ఆయన ఓ కొత్త నటుడిగా సెట్స్‌లో కష్టపడతారు. పీపుల్ మీడియా వంటి ప్రముఖ సంస్థ ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది. నాకు డ్యాన్స్ బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఈ సినిమాలోని ‘రెప్పల్ డప్పుల్’, ‘సితార’పాటలకు మంచి స్పందన లభిస్తుండటం
సంతోషాన్నిచ్చింది. ఇక నా నెక్ట్స్ మూవీస్ గురించి త్వరలో చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment