రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సంపాదించుకుంది. కథ-కథనం బాలేకపోయినా.. సంగీతం మాత్రం అదిరిపోయిందని అంతా అంటున్నారు. పాటల విషయంలో హరీశ్ మరోసారి తన మార్క్ చూపించారని కొనియాడుతున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్కే సినిమాకు ప్లస్ పాయింట్ అని పలు వెబ్‌సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే ‘సితార్’ పాటలో రవితేజ-భాగ్యశ్రీ బోర్సే వేసిన ఓ స్టెప్పు మాత్రం కాంట్రవర్సీకీ దారి తీసింది.
(చదవండి: మిస్టర్ బచ్చన్ రివ్యూ)
కొంతమంది నెటిజన్స్ ఆ స్టెప్పు తాలుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరీశ్ శంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు. చర్చనీయాంశమైన ఆ స్టెప్పు గురించి తాజాగా హరీశ్ శంకర్ స్పందించాడు. పాటలకు హీరోహీరోయిన్లు చేసే డ్యాన్స్‌ని ఫ్లోలో చూస్తే బాగుంటుందని.. స్క్రీన్ షాట్ తీస్తే ఇబ్బందిగానే కనిపిస్తుందని అని అన్నాడు.
‘వాస్తవానికి ఆ పాటకు ఆ స్టెప్ అవసరం లేదని నాక్కుడా అనిపించింది. అయితే షూటింగ్ మొదటి రోజే ఆ పాటను షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మూమెంట్‌ని మొదటి రోజే నేను వద్దు అంటే బాగోదేమో అని ఆగిపోయాను. షూటింగ్ బిజీలో పడి అది పట్టించుకోలేదు. సెన్సార్‌లో కూడాఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్‌ని ఫ్లోలో చూడాలి. అలా కాకుండా స్క్రీన్ షాట్ తీసి చూస్తే చాలా వరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది’ అని హరీశ్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment