వేసవి నుంచి వేగం | Samantha Akkineni and Sharwanand in 96's Telugu remake | Sakshi
Sakshi News home page

వేసవి నుంచి వేగం

Published Sat, Jan 19 2019 2:25 AM | Last Updated on Sat, Jan 19 2019 2:25 AM

Samantha Akkineni and Sharwanand in 96's Telugu remake - Sakshi

శర్వానంద్‌

2018లో తమిళంలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘96’ ఒకటి. విజయ్‌ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి పాత్రను శర్వానంద్‌ పోషించనున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ లవ్‌ స్టోరీని తమిళ వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం. హీరోయిన్‌గా సమంత యాక్ట్‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కలిసి చదువుకున్న ఫ్రెండ్స్‌ అందరూ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం, పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం, వారిలో ఓ ప్రేమ జంట వాళ్ల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. ఇలా సినిమా కథ సాగుతుంది. వేసవి నుంచి ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయి జ్ఞాపకాల్లో వేగంగా వెనక్కి వెళ్తారన్నమాట శర్వానంద్‌. ప్రస్తుతం సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు శర్వానంద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement