
త్రిష
సిల్వర్ స్క్రీన్‌పై మెరిసే తారలు ఏదైనా కొత్త స్టైల్‌లోకి మారితే హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు వార్తల్లో నిలిచారు త్రిష. కారణం జుట్టుని కురచగా కత్తిరించుకోవడమే. ఉన్నట్లుండి త్రిషకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అనే చర్చ జరుగుతోంది. పైగా చేతిలో సినిమాలు లేకపోతే ఏదో సరదా కోసం చేశారనుకోవచ్చు. ఇటీవల కమిట్ అయిన రజనీకాంత్ సినిమాతో కలిపి ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి.
రజనీ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ ఆరంభమై కొన్ని రోజులైంది. ఇంకా హీరోయిన్ త్రిష ఎంటర్ అవ్వలేదు. త్వరలో ఎంటర్ కానున్నారు. ఈ సమయంలో హెయిర్ కట్ చేయించుకున్నారంటే రజనీ సినిమా కోసమే అని, ఇందులో త్రిష కొత్త లుక్‌లో కనిపిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహలు నిజం అవ్వొచ్చు.. అవ్వకపోనూ వచ్చు. కొన్నాళ్లు ఆగితే అసలు కథేంటో తెలుస్తుంది. అన్నట్లు ఇప్పటివరకూ త్రిషను ఏ సినిమాలోనూ ఇలా చూడలేదు. సో.. సరికొత్త త్రిషను చూడబోతున్నామన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment