
త్రిష
మగవాళ్లను జీతం, ఆడవాళ్లను వయసు అడగకూడదు అంటారు. ఫర్వాలేదు.. నన్ను అడగండి నేను చెప్పేస్తా అంటున్నారు త్రిష. అవునా.. మీ వయసెంత? అంటే... ‘స్వీట్ 16’ అంటారామె. నిజంగా స్వీట్ సిక్స్‌టీనా? త్రిష అబద్ధం ఆడుతుందనుకోకండి. నిజమే చెబుతున్నారామె. త్రిష చెబుతున్నది తన స్క్రీన్ ఏజ్ గురించి. నటిగా త్రిష వయసు స్వీట్ 16. డిసెంబర్ 13, 2002లో తన మొదటి చిత్రం ‘మౌనం పేసియదే’ విడుదలైంది. కథానాయికగా ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి, అటునుంచి తెలుగుకి వచ్చారామె. అంటే.. నటిగా పదహారేళ్లు పూర్తి చేసుకున్నారు త్రిష.
ఈ పదహారేళ్ల కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్‌లో నటించి, విభిన్న పాత్రలు, గెటప్స్‌లో ప్రేక్షకులను అలరించారీ చెన్నై పొన్ను. ‘‘పొద్దున్నుంచి మెసేజ్‌లు, వీడియోలు పంపుతున్నారు నా ఫ్యాన్స్. ఇలాంటి సందర్భాలను నాకంటే మీరే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇలాంటి అభిమానం దొరికినందుకు సంతోషంగా ఉంది. స్వీటెస్ట్ 16 ఇయర్స్ అనిపిస్తోంది. ఈ జర్నీ అనుకున్నదానికంటే చాలా బాగా సాగింది’’ అని ఫ్యాన్స్‌ను, సినీ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు త్రిష. ఇంత లాంగ్ కెరీర్ సాగినా ఇప్పటికీ సూపర్‌స్టార్స్‌తో జోడీ కడుతూ ముందుకు దూసుకుపోతున్నారు త్రిష. ప్రస్తుతం తన హ్యాండ్‌బ్యాగ్‌లో ‘పేట్టా, గర్జనై, సతురంగ వేటై్ట, 1818, పరమపదమ్ విలయాట్టు’ చిత్రాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment