
లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించడం చెన్నై సుందరి త్రిషకు కొత్తేమీ కాదు. తమిళంలో ‘నాయకి’, ‘1818’ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించారు. కానీ టాలీవుడ్ దర్శకుడు సతీష్ వేగేశ్నకు ఇది న్యూ జానర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో రూపొంది, జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ‘శతమానం భవతి’, ప్రజెంట్ నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలు హీరో ఓరియంటెడ్. ఇప్పుడు సతీష్, త్రిష గురించిన ప్రస్తావన ఎందుకంటే.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో త్రిష ముఖ్య తారగా ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తెరకెక్కనుందన్న వార్తలు ఇండస్ట్రీలో ప్రచారం అవుతున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment