
పిల్లలు గౌతమ్, సితారతో మహేశ్
బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలసి మహేశ్‌బాబు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసేస్తారు. లాక్‌డౌన్ వల్ల షూటింగ్స్ నుంచి లాంగ్ బ్రేక్ వచ్చినా ప్రయాణాలు చేయలేకపోయారు. జర్నీలు కూడా రద్దయ్యాయి కదా. ఇప్పుడు ప్రయాణాలకు కూడా అనుమతి ఉండటంతో కుటుంబంతో కలసి మహేశ్ విదేశీ ట్రిప్ ప్లాన్ చేశారు. ‘‘కొత్త విధానానికి అలవాటుపడుతున్నాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుని, ఫ్లయిట్ జర్నీకి రెడీ అయ్యాం. జీవితం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. జెట్ సెట్ గో’’ అంటూ కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు మహేశ్‌బాబు. ఎక్కడికి వెళుతున్నదీ బయటపెట్టలేదు కానీ, ఇది పది రోజుల ట్రిప్ అని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment