విదేశాలకు ప్రభాస్‌.. సర్జరీ కోసమేనా! | [Prabhas Going To Foreign Trip, What's Up? - Sakshi
Sakshi News home page

Prabhas: విదేశాలకు ప్రభాస్‌.. సర్జరీ కోసమే!

Published Wed, Sep 13 2023 2:33 PM | Last Updated on Wed, Sep 13 2023 3:09 PM

Prabhas Going To Foreign Trip - Sakshi

ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన సలార్‌ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడిందని, త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. మరోవైపు ప్రాజెక్ట్‌ కే(కల్కీ 2898 ఏడీ) షూటింగ్‌ పనులు చకచకగా జరుగుతున్నాయి. అలాగే మారుతి సినిమా కూడా సెట్‌పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా ప్రభాస్‌ పాల్గొన్నాడు. ఇప్పటికే కొంతమేర షూటింగ్‌ పూర్తి చేశాడు. ఈ మధ్యే  ఓ భారీ ఫైట్‌ సీన్‌ షూటింగ్‌లో పాల్గొన్నారట. 

(చదవండి: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌..)

లాంగ్‌ ట్రిప్‌
సలార్‌ వాయిదా పడడంతో ప్రభాస్‌ విదేశీ ట్రిప్‌ వేసినట్లు తెలుస్తోంది. సలార్‌ వాయిదా విషయం ఈ రోజు అధికారికంగా ప్రకటించారు కానీ చిత్ర యూనిట్‌ ఎప్పుడో ఫిక్స్‌ అయింది. ఈ విషయం ప్రభాస్‌కు కూడా తెలుసు. అందుకే ప్రాజెక్ట్‌ కే, మారుతి సినిమాల షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లాడట. అందుకే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాడట. దాదాపు 15 రోజుల తర్వాత తిగిరి హైదరాబాద్‌కు వస్తాడట. ఈ లోపు ప్రాజెక్ట్‌ కే, మారుతి సినిమాల్లో హీరో అవసరం లేని సన్నివేశాల షూటింగ్స్‌ జరుపుకుంటారట.  ప్రభాస్‌ విదేశాల నుంచి తిరిగి రాగానే ఆయనకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌ని ప్లాన్‌ చేస్తారట. 

సర్జరీ కోసమే!
ప్రభాస్‌ విదేశీ పర్యటనకు వెళ్లారని తెలుసు కానీ..ఏ దేశం వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు అనేది మాత్రం ఎవరూ రివీల్‌ చేయడం లేదు. కానీ సర్జరీ కోసమే ప్రభాస్‌ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.  బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చెయ్యడంతో ప్రభాస్‌కు మోకాలి నొప్పి సమస్య వచ్చింది. ఇప్పటివరకు తగ్గలేదు. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలు  సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడు అని టాక్. సర్జరీ అనంతరం విదేశాల్లోనే రెండు వారాల పాటు ఉండి విశ్రాంతి తీసుకుంటారట. ఆ తర్వాత భారత్‌కి తిగిరి వచ్చి షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌లో పాల్గొంటారట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement