మోస్ట్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ అంటూ ప్రభాస్‌ పోస్ట్‌ | Actor Prabhas Interesting Comments On Deepika Padukone On Her Birthday, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Prabhas Birthday Wishes To Deepika: మోస్ట్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ అంటూ ప్రభాస్‌ పోస్ట్‌

Published Fri, Jan 5 2024 5:20 PM | Last Updated on Fri, Jan 5 2024 6:33 PM

Prabhas Comments On Deepika Padukone - Sakshi

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె ఒకరు. భారతదేశంలోనే టాప్‌ హీరోయిన్‌గా ఆమె కొనసాగుతుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించి ప్రపంచానికి తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో వ్యాఖ్యాతగా మెరిసింది. ఇలా తన జీవితంలో ఎన్నో విజయాలను అందకున్న ఈ బ్యూటీ నేడు (జనవరి 5) 38వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమ, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

తాజాగా హీరో ప్రభాస్ కూడా ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీపికను 'అత్యంత అందమైన నటి' అని ప్రభాస్ పేర్కొన్నాడు. భవిష్యత్తు రోజులు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరిద్దరూ కలిసి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ ప్రధానంగా ఇందులో నటించారు. ఈ చిత్రం ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో కూడా ప్రదర్శించబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్, దీపికా అభిమానులు కొత్త సినిమాపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్ డే గర్ల్ దీపికా పదుకొనే నటించిన ఫైటర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. హృతిక్ రోషన్ తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఫైటర్' ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.  అమితాబ్ బచ్చన్‌తో కూడా 'ది ఇంటర్న్' ప్రాజెక్ట్‌పై దీపిక సంతకం చేసింది. ఇలా ఈ బ్యూటీ చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement