
లాస్ ఏంజెలిస్: ఇటీవల పారిస్ టూర్‌కు వెళ్లినప్పుడు బాయ్‌ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేస్తాడనుకున్నా అలా జరగలేదంటోంది మోడల్, హాలీవుడ్ నటి కెల్లీ బ్రూక్. అయితే తాను ఊహించింది జరగకపోవడంతో పాటు షాక్ తిన్నానని చెప్పింది కెల్లీ. అసలు విషయం ఏంటంటే.. మోడల్ కెల్లీ బ్రూక్, జెరేమీ పార్శి గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ పారిస్‌కు హాలిడే ట్రిప్ అంటూ చక్కర్లు కొట్టారు.
'ఇటీవల పారిస్‌కు వెళ్దామని జెరేమీ ప్లాన్ చేశాడు. అక్కడ తనకు లవ్ ప్రపోజ్ చేస్తాడని భావించాను. కానీ నాకు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చాడు జెరేమీ. రొమాంటిక్ ప్రదేశమైన పారిస్‌లో ప్రపోజ్ చేయకపోగా, అక్కడ మాకోసం బుక్ చేసిన హోటల్ గతంలో వ్యభిచార గృహమని తెలియగానే ఇలాంటి చోట ఉన్నామా అని షాక్‌కు గురయ్యాను. ప్రపోజ్ చేయకపోతేనేం, జంటగా షాపింగ్ చేశాం. జెరేమీ పేరెంట్స్‌ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ' తనకు పారిస్‌లో ఎదురైన అనుభవాలను కెల్లీ బ్రూక్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment