
మహేశ్‌బాబు
మహేశ్‌బాబు ఈ దసరా పండక్కి కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. ‘‘దసరాబ్రేక్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. ఫుల్ చార్జ్‌తో తిరిగి వస్తా’’ అన్నారు మహేశ్. శనివారం మహేశ్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారని సమాచారం.. పండగ సమయాల్లో మహేశ్ విహార యాత్రలకు వెళ్లడం ఇది మొదటిసారేం కాదు. ఎలాగూ పిల్లలు గౌతమ్, సితారలకు స్కూల్ సెలవులు ఇచ్చేశారు. వాళ్ల సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారట.
విదేశాల్లో ఫ్యామిలీతో సెలవుల పండగ చేసుకుని తిరిగొచ్చిన తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు మహేశ్. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో దాదాపు 70 శాతం సినిమా పూర్తయిందని సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment