రెండు మూడు నెలలుగా ‘పుష్ప’ చిత్రీకరణలో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు అల్లు అర్జున్. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ పూర్తి చేయడానికే ఈ బిజీ. మారేడుమిల్లి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో హైదరాబాద్ షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఈలోపు అల్లు అర్జున్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఫ్యామిలీతో కలసి ఓ హాలిడే ప్లాన్ చేసుకున్నారు. వారం పాటు భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేయనున్నారాయన. ఈ హాలిడే పూర్తయ్యాక మళ్లీ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీ అవుతారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment