
హ్యాపీగా..జాలీగా..
హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు త్రిష. సూట్‌కేస్‌లో బట్టలు సర్దుకున్నారు. మేకప్ కిట్ కూడా పెట్టుకున్నారు. వాటితో పాటు గొడుగు కూడా తీసుకెళ్లారు. ఇదేంటి అనుకుంటున్నారా? త్రిష వెళ్లింది న్యూయార్క్‌కి. అక్కడ రెయినీ సీజన్ అట. అందుకే ముందు చూపుతో గొడుగు కూడా ప్యాక్ చేసుకున్నారు. నిజానికి హాలిడేస్ తీసుకునేంత ఖాళీ త్రిషకు లేదు. ఆమె డైరీ ఫుల్. త్రిష చేతిలో ప్రస్తుతం తొమ్మిది సినిమాలున్నాయి. మూడు సినిమాలు పూర్తి కాగా, ఇంకో ఆరు సినిమాల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ షెడ్యూల్స్ మధ్య చిన్న గ్యాప్ దొరికిందట. అంతే.. తల్లి ఉమాకృష్ణన్‌తో కలసి న్యూయార్క్ చెక్కేశారు. ‘హలీడేస్‌ను హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేస్తున్నాను’ అంటున్నారామె. కాలు బయటపెట్టేటప్పుడు వర్షం రాకపోయినా హ్యాండ్ బ్యాగ్‌తో పాటు గొడుగు కూడా చేత్తో పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి.. మేడమ్‌కి ముందు జాగ్రత్త ఎక్కువ అంటే ఒప్పుకుంటారు కదూ.