మలేసియాలో మస్త్‌ మజా | mahesh babu family malaisia trip | Sakshi
Sakshi News home page

మలేసియాలో మస్త్‌ మజా

Published Fri, Sep 21 2018 3:30 AM | Last Updated on Fri, Sep 21 2018 3:30 AM

mahesh babu family malaisia trip - Sakshi

మహేశ్‌బాబు

బిజీ షెడ్యూల్స్‌ మధ్య కాస్త తీరిక సమయం దొరికితే ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి ఇష్టపడతారు మహేశ్‌బాబు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు ప్రూవ్‌ అయ్యింది. ఇప్పుడు ఆయన మలేసియాలో హాలిడేను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ఆయన సతీమణి నమ్రత. ఇక సినిమాల విషయానికి వస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’.

అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ అమెరికాలో స్టార్ట్‌ కానుంది. వచ్చే నెల మొదటి వారంలో అక్కడ చిత్రీకరణ స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈలోపు ఈ హాలిడేను ప్లాన్‌ చేసుకున్నట్లున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement