
మహేశ్ బాబు, సితార, గౌతమ్‌లతో మహేశ్
మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీ జాలీ మూడ్‌లో ఉన్నారు. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఫ్యామిలీతో కలిసి ఓ వారం రోజులు హాలిడే ట్రిప్ వెళ్లారు మహేశ్ బాబు. సినిమా రిలీజ్ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ కోసం ఆ టూర్. ఇప్పుడు సినిమా సక్సెస్ ఇచ్చిన జాలీ మూడ్‌తో హాలిడే మోడ్‌లోకి వెళ్లారు మహేశ్. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో మరో టూర్‌ని ప్లాన్ చేశారు. ‘‘ప్యారిస్ వెళ్తున్నాం. అందరికీ హ్యాపీ హాలిడేస్’’ అని కొన్ని ఫొటోలను షేర్ చేశారు నమ్రత.
అక్కణ్ణుంచి తిరిగి రాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్‌లో మహేశ్ పాల్గొంటారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లొకేషన్స్ సెర్చ్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందుకోసం కెమెరామెన్ మోహనన్‌తో కలిసి న్యూయార్క్ వెళ్లారు వంశీ. ‘‘కెమెరామెన్ కేయు మోహనన్‌తో కలిసి న్యూయార్క్‌లో మహేశ్‌బాబు సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాం. మోహనన్ దగ్గర పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా నేర్చుకోవాలి’’ అన్నారు వంశీ. అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment