
కియారా అద్వానీ
బిర్లా మందిర్‌కిరా కలిసి గుడికెళ్దాం. ప్యారడైస్‌కి వస్తే హైదరాబాదీ బిర్యానీ తిందాం. గోల్కొండలో షికారు కొడదాం అంటూ ఇన్విటేషన్ల మీద ఇన్విటేషన్‌లు వస్తున్నాయి హీరోయిన్ కియారా అద్వానీకి. సడెన్‌గా ఎందుకీ ఆహ్వానాలు? అసలు ఎవరినుంచి వస్తున్నాయి? అంటే.. నెటిజన్‌ల నుంచి. ‘భరత్ అనే నేను’తో ఆకట్టుకున్న కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
సోమవారం కియారాకు షూటింగ్ లేదట. సో.. హైదరాబాద్‌ని సందర్శించదలిచారు. ఈ బాలీవుడ్ భామకి ఏయే ప్లేస్‌లు తిరగాలో తెలియక ట్వీటర్‌లో నెటిజన్లను సలహా అడిగారు. చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్‌బండ్.. అంటూ కొందరు చక్కగా సలహాలు ఇచ్చినప్పటికీ కొందరు ఆకతాయిలు మాత్రం చార్మినార్ దగ్గరకు రండి చాయ్ తాగిస్తా, కోటిలో షాపింగ్‌కి తీసుకెళ్తాను అంటూ కొంటెగా రిప్లైలు ఇచ్చారు. హీరోయిన్ అంటే ఎంత ప్రేమో.. ఆ దరికొస్తావా? ఈ దరికొస్తావా అని ఇన్వైట్ చేశారు. కానీ కియారా ఈ ఆహ్వానాలు స్వీకరించకుండా ఒంటరిగానే చార్మినార్ వెళ్లి షాపింగ్ చేస్తూ తన హాలిడేను ఎంజాయ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment