Sameera Reddy Shares Throwback Pics Of First Audition For Mahesh Babu Movie, Goes Viral - Sakshi
Sakshi News home page

Sameera Reddy: మహేశ్ బాబు సినిమా ఆడిషన్స్.. చాలా భయపడ్డా: సమీరా రెడ్డి

Published Fri, Feb 3 2023 5:46 PM | Last Updated on Fri, Feb 3 2023 6:36 PM

Sameera Reddy Shares Throwback Pics Of Mahesh Babu Movie Auditions - Sakshi

సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం గుర్తు రాకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భామ ఆ తర్వాత పెద్దగా తెరపై కనిపించలేదు. కానీ టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్‌ ఆరంగ్రేటం చేసింది సమీర.  తెలుగులో  చిరంజీవి సరసన జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ.

తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.  1998లో తెలుగు సినిమా ఆడిషన్స్‌కు హాజరైన విషయాన్ని వెల్లడించింది. టాలీవుడ్ హీరో ఆడిషన్స్‌లో సరైన ఫర్మామెన్స్ చేయకపోవడంతో ఏడ్చుకుంటూ ఇంటికెళ్లానని చెప్పుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

సమీరా తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' అప్పుడు 1998. నేను మహేశ్ బాబు సినిమా ఆడిషన్‌కు వెళ్లా.  ఆరోజు చాలా భయమేసింది. దాంతో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయా. ఇంటికి తిరిగి వెళ్తూ ఏడ్చేశా. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చేశా. నేను రెండేళ్లు పని చేసిన వాచ్‌ కంపెనీలోనే ఉండాలని డిసైడ్ అయిపోయా. నా ముఖానికి డెస్క్ జాబే కరెక్ట్ అనుకున్నా. కానీ ఆ తర్వాత నేను మళ్లీ ధైర్యం తెచ్చుకుని బాలీవుడ్‌లో అహిస‍్తా కీజియో బాటియన్ మ్యూజిక్ వీడియో చేశా. ' అంటూ ఆడిషన్స్‌ ఫోటోలు పంచుకుంది.  ఇది చూసిన సమీరా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  అప్పుడే మీరు చాలా అందంగా ఉన్నారంటూ మరికొందరు పొగుడుతున్నారు. 

కాగా..  సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు  కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది సమీరా రెడ్డి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement