కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి! | Sameera Reddy Name Their Baby Girl Nyra | Sakshi
Sakshi News home page

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

Published Wed, Jul 31 2019 4:23 PM | Last Updated on Wed, Jul 31 2019 4:46 PM

Sameera Reddy Name Their Baby Girl Nyra - Sakshi

గర్భం ధరించినప్పటి నుంచి ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకూ సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టి వార్తల్లో నిలిచారు నటి సమీరా రెడ్డి. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో మాతృత్వంపై తన ఆలోచనలను పంచుకున్నారు. శరీరాకృతి ఎలా ఉన్నా దానిని స్వీకరించాలని సమీరా రెడ్డి తన భావాలను వ్యక్తపరచడంతో చాలా మంది భారత మహిళలకు ఆమె ఓ ప్రేరణగా మారారు. ఈ నెల ప్రారంభంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సమీరా, తన కుమార్తెకు 'నైరా' అని నామకరణం చేశారు.

ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంటూ.. 'మా గారాలపట్టి నైరాను వర్డే కుటుంబానికి స్వాగతం పలుకుతున్నాం' అని పేర్కొన్నారు. 'నైరా' అనేది సరస్వతి దేవి పేరని ఆమె తెలిపారు. అంతేకాకుండా హీబ్రూలో 'మొక్క' అని అర్థం వస్తుందని, అమెరికన్ మూలంలో ‘నైట్ బోర్డర్‘ అనే అర్థం కూడా ఉందని ఆమె తెలిపారు. దీంతో ఈ అరుదైన పేరుకి వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది.

సమీరా షేర్‌ చేసిన పోస్ట్‌కు స్పందించిన ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, అనితా డోంగ్రే పేరు చాలా బావుందని ప్రశంసించారు. తన భర్త అక్షయ్ వర్దే, తాను ఓ కుమార్తెను కోరుకున్నామని అనుకున్నట్లే కుమార్తె జన్మించడంతో సంతోషంగా ఉందని గతంలో సమీరా రెడ్డి ఓ పోస్ట్‌ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement